బాబర్ ఆజమ్ ముఖచిత్రం ఏమిటో?
టీ20 వరల్డ్ కప్ లీగ్స్ లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత, పాకిస్తాన్ బౌన్స్ బ్యాక్ అయింది. తన తర్వాతి మ్యాచ్‌లో నమీబియాపై ఘన విజయాన్ని సాధించింది. దీనికోసం జట్టులో కొన్ని కీలక మార్పులు చేయాల్సొచ్చింది. స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదిని తుది జట్టు నుండి తప్పించింది. బాబర్ ఆజమ్ కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో డిమోట్ అయ్యాడు. ఈ మార్పులు భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో చోటు చేసుకోలేదని జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ స్పష్టం చేశారు. వీటిని వ్యూహాత్మకమైనవిగా అభివర్ణించారు.
తుదిజట్టులో ఉన్నప్పటికీ నమీబియాపై జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు బాబర్ ఆజమ్ కు. అతని స్థానంలో షాదాబ్ ఖాన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతను నిరాశపరచలేదు. 22 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ తో 36 పరుగులో అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 163.63. అదే ఇప్పుడు బాబర్ ఆజమ్ బ్యాటింగ్ ఆర్డర్ కు ఎర్త్ పెట్టినట్టయింది. సూపర్ 8లో భాగంగా నేడు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో కూడా ఇదే బ్యాటింగ్ ఆర్డర్ కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

రెగ్యులర్ గా బ్యాటింగ్ కు దిగే మూడో స్థానాన్ని కోల్పోవడానికే అవకాశాలు ఉన్నాయి. పవర్‌ప్లేలో బాబర్ ఆజమ్ స్ట్రైక్‌రేట్ అంచనాలకు తగినట్లు లేదని హెస్సాన్ వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ పవర్‌ప్లేలో స్ట్రైక్‌రేట్ 100 కంటే తక్కువగా ఉందని బాబర్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతని అనుభవం అక్కరకొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఒకసారి అతను క్రీజ్ లో కుదురుకున్నాక తన స్ట్రైక్‌రేట్‌ను పెంచుకోగలడని, ఆసియా కప్ తర్వాత బాబర్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చామని గుర్తు చేశాడు.
మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్లు పడకుండా ఆడటం అవసరమని, ఆ పాత్రను బాబర్ ఆజమ్ సమర్థవంతంగా నిర్వహించగలడని మైక్ హెస్సాన్ పేర్కొన్నాడు. జట్టు స్కోరింగ్ వేగాన్ని పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు- ప్రత్యేకించి 12వ ఓవర్ తర్వాత బాబర్ బ్యాటింగ్ రావడానికి సరైన ఆటగాడు కాదని హెస్సాన్ వివరించారు. అందుకే నమీబియాపై జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేశామని, అది సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications