టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. డేంజరస్ ప్లేయర్ అవుట్.. ?
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. షమీ బౌలింగ్‌లో అదరగొట్టగా, బ్యాటింగ్‌లో గిల్ సెంచరీతో రాణించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో హైఓల్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య నేడు సూపర్ సండే మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా మంచి జోష్‌లో ఉండగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే కచ్చితంగా టీమిండియాను ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు చావో రేవో లాంటిది.టీమిండియాపై గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది.

స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నారు.ఈ విషయాన్ని భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తెలిపారు.శుభ్‌మాన్ గిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిషబ్ పంత్ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు.ప్రాక్టీస్ సెషన్‌లో కూడా రిషబ్ పంత్ పాల్గొనలేదు.పంత్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, జ్వరం కారణంగా అతను ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదని గిల్ తెలిపారు. రిషబ్ పంత్ లేకపోయినా , అది భారత్ జట్టుపై ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎందుకంటే జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు.












Click it and Unblock the Notifications