టీ20 వరల్డ్ కప్ వేళ.. అనూహ్య మలుపు తీసుకున్న బంగ్లాదేశ్ వివాదం

భద్రతా కారణాలను చూపుతూ భారత్ కు వెళ్లడానికి మొండికేస్తోన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. బోర్డు తాము ఆడబోయే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా అభ్యర్థించిన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదన తిరస్కారానికి గురైంది. దీన్ని తిరస్కరించింది కూడా క్రికెట్ ఆడే ఓ చిన్న దేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ దేశమే.. ఐర్లాండ్.

టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును భారత్ కు పంపడం సాధ్యం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. భారత గడ్డపై తమ మ్యాచ్‌లను ఆడకూడదని 17 మంది బీసీబీ డైరెక్టర్లు తీర్మానించారని, దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీతో ఒప్పందం ఉన్నప్పటికీ తమ దేశ క్రికెటర్ భారత్‌లో ఆడలేకపోతే దానికి అర్థం లేదని స్పష్టం చేసింది అప్పట్లో. దీనికి ప్రత్యామ్నాయంగా ఐర్లాండ్ తో గ్రూప్ స్వాపింగ్ ను ప్రతిపాదించింది.

Bangladesh Seeks T20 World Cup Group Swap Ireland Delivers Response

శనివారం ఏర్పాటు చేసిన భేటీలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ ప్రతిపాదనను ఐసీసీ ముందుకు తీసుకొచ్చింది. ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ కూడా శ్రీలంకలో ఆడగలుగుతామని కోరింది. భారత్‌లో జరగబోయే మ్యాచ్‌లన్నింటినీ కూడా శ్రీలంకకు తరలించడం సాధ్యం కాకపోవడం వల్ల స్వాపింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. దీనివల్ల ఎటువంటి మార్పులు లేకుండా తాము శ్రీలంకలో, ఐర్లాండ్ భారత్ లో ఆడుతుందని పేర్కొంది.

ఈ ప్రతిపాదనలను క్రికెట్ ఐర్లాండ్ (CI) అంగీకరించలేదు. వీటిని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తమ ప్రపంచ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఈ మేరకు ఐసీసీ నుంచి ఖచ్చితమైన హామీలు లభించాయని స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయని CI పేర్కొంది. షెడ్యూల్ మారబోదని ఖచ్చితమైన హామీ ఐసీసీ నుంచి లభించిందని, గ్రూప్ దశ మ్యాచ్‌లన్నింటినీ కూడా శ్రీలంకలోనే ఆడతామని క్రికెట్ ఐర్లాండ్ అధికారి క్రిక్‌బజ్‌కు తెలిపారు.

ప్రస్తుతం ఐర్లాండ్ గ్రూప్ బీలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమాన్‌ ఉన్నాయి. బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉంది. ఇందులో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్‌ జట్లు ఉన్నాయి. ఆయా జట్లతో కోల్‌కతా, ముంబైల్లో మ్యాచ్ లను ఆడాల్సి ఉంది బంగ్లాదేశ్ కు. టీ20 ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్ళడానికి తాము సిద్ధంగా లేమని BCB అంతకుముందే ఐసీసీకి స్పష్టం చేసింది. జట్టు, అభిమానులు, మీడియా సహా ఇతర వాటాదారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+