టీ20 వరల్డ్ కప్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తే చాలు..!!
టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఫిబ్రవరి 7వ తేదీన తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిపై అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. రోజుల తరబడి సాగుతోందీ వ్యవహారం మొత్తం కూడా. ఇప్పటికే బంగ్లాదేశ్ తప్పుకొంది. ఈ జట్టుకు మద్దతుగా టోర్నమెంట్ ను స్పాయిల్ చేసేలా పాకిస్తాన్ అనూహ్య ఎత్తుగడలు వేస్తోంది గానీ ఏవీ పెద్దగా వర్కవుట్ కావట్లేదు.
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ లెజెండరీ ప్లేయర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగితే చోటు చేసుకోబోయే పరిణామాల గురించి ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ తప్పుకొంటే స్పాన్సరర్లకు భారీ నష్టాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి కోసం పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ చేసిన ప్రకటన, ఐసీసీ ఆంక్షల హెచ్చరికల మధ్య పాకిస్తాన్ భాగస్వామ్యంపై సందిగ్ధత నెలకొనడాన్ని ప్రశంసించారు.

భారత్, శ్రీలంకలలో జరగనున్న ఈ టోర్నీలో పాక్ పాల్గొనకపోతే స్పాన్సరర్లకు ఆర్థిక నష్టం సంభవిస్తుందని పేర్కొన్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ లేకపోతే టోర్నమెంట్ వాతావరణమే దెబ్బతింటుందని బాసిత్ అలీ పేర్కొన్నారు. గేమ్ ప్లాన్ యూట్యూబ్ షోలో ఆయన మాట్లాడారు. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడకపోతే స్పాన్సరర్లు రోడ్డున పడతారని తేల్చి చెప్పారు.
పాకిస్తాన్ తప్పుకుంటే ఏ జట్టు వస్తుందని, భారత్ ప్రత్యామ్నాయ జట్టుతో ఆడితే, భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు లభించినంత ఆదరణ పొందబోదని స్పష్టం చేశారు. వరల్డ్ కప్‌లో తమ భాగస్వామ్యంపై తుది నిర్ణయం ప్రభుత్వమేనని పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ స్పష్టం చేయడంతో ఐసీసీ ఇబ్బందికరమైన స్థితిలో పడిందని బాసిత్ అలీ ప్రశంసించారు. భద్రతా కారణాలతో భారత్‌కు వెళ్లని బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుండి తొలగించిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భాగస్వామ్యం గురించి ప్రభుత్వాన్ని అడుగుతామంటూ నఖ్వీ చేసిన ఈ వ్యాఖ్యలు ఐసీసీకి చాలా క్లిష్టమైన పరిస్థితిని సృష్టించిందని బాసిత్ అలీ పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ ను పాకిస్తాన్ బాయ్‌కాట్ చేయకూడదని, ఈ జట్టు భారత్‌లో ఆడాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా పాకిస్తాన్ నిలబడటంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ప్రపంచకప్ నుండి వైదొలిగితే ఆంక్షలు తప్పవని ఐసీసీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications