విమెన్స్ టీ20 వరల్డ్ కప్: టీమిండియా కేప్టెన్‌గా..
ICC Women's T20 World Cup 2024: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో విజేతగా నిలిచింది భారత్. బార్బడొస్‌లో జరిగిన ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. రెండోసారి ఈ షార్ట్ ఫార్మట్‌లో ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్స్‌కు గుడ్‌బై చెప్పారు.
మరో టీ20 వరల్డ్ కప్ తెరమీదికి వచ్చింది. ఈ సారి మహిళలు పోటీ పడబోతోన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఇంకొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. మొత్తం 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్నాయి.

ఈ టోర్నమెంట్ వామప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 28వ తేదీన షెడ్యూల్ అయ్యాయి. తొలి రోజే రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. వామప్స్‌లో స్కాడ్లాండ్‌తో పాకిస్తాన్, శ్రీలంకతో బంగ్లాదేశ్ పోటీపడబోతోన్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి లీగ్స్ మొదలవుతాయి. గ్రూప్స్ తొలి మ్యాచ్‌లల్లో బంగ్లాదేశ్- స్కాట్లాండ్, పాకిస్తాన్- శ్రీలంకలు ఢీ కొట్టనున్నాయి.
గ్రూప్ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్ బీలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్‌కు చోటు దక్కింది. తాజాగా- ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఆడబోయే భారత జట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది బీసీసీఐ.
జట్టుకు ఎప్పట్లాగే హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని వహిస్తారు. స్మృతి మంధాన, షఫాలి వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాష్తికా భాటియా, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజీవన్ సంజనకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications