IPL 2025కి ముందు బీసీసీఐ బిగ్ డెసిషన్..!!
ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఇప్పటికే కొందరు విదేశీ క్రికెటర్లు భారత్‌కు చేరుకుని ఆయా జట్లతో ప్రాక్టీస్ సెషన్స్ కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే బీసీసీఐ తీసుకున్న ఓ నిర్ణయం ఇటు ఆటగాళ్లకు అటు జట్ల యాజమాన్యాలకు ఇంపితం కావడం లేదు. ఇంతకీ బీసీసీఐ తీసుకున్న ఆ బిగ్ డెసిషన్ ఏంటి..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కొత్త నిర్ణయం తీసుకుంది. ఆయా స్టేడియంలలో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి పిచ్ స్వభావం మారకుండా ఉండేందుకు ఈ తాజా నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మ్యాచ్‌కు ముందు ఆయా జట్లు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాక్టీస్ సెషన్స్‌కు సమయ పరిమితి విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ జట్టుకైనా సరే 7 ప్రాక్టీస్ సెషన్లకు మించి ఉండవని బీసీసీఐ తేల్చేసింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన ద్వారా ఐపీఎల్ జట్టు యాజమాన్యాలకు తెలిపింది.

ఐపీఎల్ టోర్నమెంటుకు ముందు ఆయా స్టేడియంలలో స్థానిక క్రికెట్ టోర్నమెంట్లు, లెజెండ్స్ లీగ్ లేదా సెలబ్రిటీ మ్యాచ్‌లను నిర్వహించకుండా నిషేధించాలనే మునుపటి ఆదేశాలను అనుసరించి ఈ నిర్ణయం బీసీసీఐ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీసీఐ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఫ్లడ్‌లైట్ వెలుతురులో మూడుగంటల పాటు ఏడు ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించొచ్చని పేర్కొంది. లైట్ల కింద ప్రాక్టీస్ మ్యాచ్ మూడున్నర గంటలు మించకూడదని ఇంతకు మించి కావాలంటే బీసీసీఐ అనుమతి ఆమోదం తప్పనిసరి అని నిబంధనల్లో వెల్లడించింది.
ఒక వేళ రెండు జట్లు ఒకే సారి ప్రాక్టీస్ చేయాలని భావిస్తే విబేధాలు తలెత్తే అవకాశం ఉన్నందున.. దీన్ని పరిష్కరించేందుకు ఒక కమిటీని బీసీసీఐ వేసింది. ఈ కమిటీ జట్టు యాజమాన్యాలతో చర్చలు జరుపుతాయి. అప్పటికీ ఒక ఒప్పందానికి రాకపోతే ఇరు జట్లకు రెండేసి గంటల సమయం ప్రాక్టీస్ చేసుకునేలా బీసీసీఐ స్లాట్‌లను కేటాయిస్తుంది. ఇక సీజన్ మొత్తానికి పిచ్‌ను తయారు చేయడానికి నాలుగు రోజుల ముందు అక్కడ ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేదా సెషన్స్ నిర్వహించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది.అయితే ఒక్కో టీమ్‌కు ఒక్కో సైడ్ వికెట్‌ను కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications