Champions Trophy 2025: బీసీసీఐ యూటర్న్ ? క్రికెటర్లకు అదిరిపోయే న్యూస్..!
ఛాంపియన్స్ ట్రోఫీ వేళ భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో తాము రూపొందించిన నిబంధనల విషయంలో క్రికెటర్ల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ కీలక నిబంధన నుంచి క్రికెటర్లకు మినహాయింపు ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతంలో కీలక టూర్లకు క్రికెటర్లు తమ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లేవారు. అయితే తాజాగా వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని సమీక్షించింది. క్రికెటర్లను వారి కుటుంబాలతో సహా టూర్లకు వెళ్లేందుకు వీలుగా నిబంధనల్ని సవరించింది. అలాగే క్రికెటర్లు తమ కుటుంబాలతో కలిసి ప్రయాణాలు కూడా చేయకూడదని ఆంక్షలు పెట్టింది. వీటిని త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సవరించి తమ వరకూ మినహాయింపు ఇవ్వాలని సీనియర్ క్రికెటర్లు కోరినా ససేమిరా అంది.

కానీ ఇప్పడు ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుతున్న వేళ ఈ ఆంక్షల నుంచి క్రికెటర్లకు బీసీసీఐ మినహాయింపు ఇస్తూ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత క్రికెటర్లు తమ కుటుంబాలను ఒక మ్యాచ్‌కు తీసుకెళ్లేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ గతంలో జారీ చేసిన నిబంధనల్లో టూర్‌లో ఉన్నప్పుడు క్రికెటర్లు కుటుంబంతో గడిపేందుకు పరిమిత సమయం ఇస్తారు. 45 రోజులకు మించి సాగే పర్యటనలో ఆటగాడి కుటుంబం అతనితో రెండు వారాల వరకు ఉండేందుకు అనుమతించారు.
వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన క్రికెటర్లు తమ కుటుంబాలను యూఏఈకి తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించలేదనే వార్తలొచ్చాయి. అయితే తాజాగా తమ వైఖరిపై బీసీసీఐ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ ఈ ఆంక్షలు సడలించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications