రోహిత్‌కు ఎలాంటి ప్లాన్లూ లేవట
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో ఫైనల్స్. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిట్ హాట్ ఫేవరెట్ భారత జట్టును ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది భారత్. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్ తరువాత కేప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవుతాడంటూ వస్తోన్న ఊహాగానాలకు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెరదించారు. ఇప్పటివరకు అతను తనతో గానీ జట్టుతో గానీ చర్చించలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్‌లో గెలుపుపైనే దృష్టి సారించాడని అన్నారు.

దుబాయ్ స్టేడియంలో ప్రీమ్యాచ్ ప్రెస్ మీట్‌లో గిల్ మాట్లాడాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పాలనే విషయంపై రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడని అనుకోవట్లేదని తేల్చి చెప్పాడు. మున్ముందు ఇంకా మంచి క్రికెట్ ఆడతాడని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఫైనల్స్‌లో ఎలా గెలవాలనేదే తమ ప్లాన్ అని వ్యాఖ్యానించాడు.
గత ఏడాది జూన్‌లో బార్బడోస్‌లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత టీ20 ఫార్మట్ నుండి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తరువాత కూడా ఇలాంటి ప్రకటనే ఉండొచ్చంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తోన్నాయి. రోహిత్ బ్యాటింగ్ ఫామ్ ఆందోళనకరంగా ఉండటం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ ఊహాగానాలకు గిల్ తెరదించాడు.
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పరిస్థితులపై తమకు అవగాహన ఉందని గిల్ తెలిపాడు. ఈ పిచ్‌పై 300కు పైగా స్కోరు ఎవరూ చేయలేదని, దీనిపై ఎలా ఆడాలో, ఎలా బౌలింగ్ చేయాలో తమకు మంచి అవగాహన ఉందని స్పష్టం చేశాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తరువాత తన కెరీర్‌లో రెండో ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడటం పట్ల గిల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్‌పై గిల్ మాట్లాడాడు. దేశం తరఫున చాలా ముఖ్యమైన మ్యాచ్‌లను ఆడాడని, అనేక ఫైనల్స్, సెమీ ఫైనల్స్‌లల్లో జట్టును గెలిపించిన అత్యంత విలువైన ఆటగాడని చెప్పాడు. ఒత్తిడిని ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా దాన్ని అతను హ్యాండిల్ చేస్తాడని పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications