ఆ అనుమానాలు పటాపంచలు- శివతాండవమే ఇక
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో ఫైనల్స్. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిట్ హాట్ ఫేవరెట్ భారత జట్టును ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది భారత్. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఆ తరువాత పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. చివరి లీగ్‌లో బ్లాక్ క్యాప్స్‌ను ఓడించింది. ఈ మూడు మ్యాచ్‌లను ఆడింది దుబాయ్ పిచ్ మీదే. ఇప్పుడు ఫైనల్స్ కూడా అక్కడే ఆడబోతోండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. పిచ్ స్థితిగతులు ఎలా ఉంటాయనే విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడినట్టయింది.

ఫైనల్స్ ఆడే తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవచ్చు టీమిండియా. గత ఆదివారం న్యూజిలాండ్‌ను ఓడించిన జట్టుతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నలుగురు స్పిన్నర్లు- అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని తుదిజట్టులో తీసుకోవచ్చు.
పేస్ బౌలింగ్‌ను మహ్మద్ షమీ లీడ్ చేయనున్నాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటాకింగ్‌కు దిగడం ఖాయం. నలుగురు స్పిన్నర్లు వద్దనుకుంటే మేనేజ్‌మెంట్ బెస్ట్ ఆల్టర్నేట్.. అర్ష్‌దీప్ సింగ్. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించి.. కుల్‌దీప్ యాదవ్‌ను తప్పించవచ్చు.
ఇప్పటివరకు వన్డేల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య 119 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్‌దే పైచేయి. 61 మ్యాచ్‌లల్లో భారత్ గెలిచింది. 50 గేమ్‌లు కివీస్ సొంతం అయ్యాయి. ఒక్క మ్యాచ్ టై అయింది. ఏడు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గాయి. ఐసీసీ ఈవెంట్‌లల్లో కూడా సమానంగా నిలిచాయి ఈ రెండు జట్లు. చెరో ఆరు మ్యాచ్‌లను గెలిచాయి.
కాగా ఫైనల్స్‌కు ఒక్క రోజు ముందు నెట్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ గాయపడటం జట్టును ఆందోళనకు గురి చేసింది. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఫాస్ట్ బౌలర్ సంధించిన ఓ డెలివరీ నేరుగా అతని ఎడమ మోకాలిని తాకింది. కొద్దిసేపు నొప్పితో బాధపడ్డాడు కోహ్లీ. ఫిజియోథెరపిస్ట్‌తో మసాజ్ చేయించుకున్నాడు. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాడు. నెట్స్‌ను వదిలి వెళ్లాడు. మళ్లీ ప్రాక్టీస్‌కు రాలేదు.
అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కలవరపాటుకు గురి చేసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కేప్టెన్ రోహిత్ శర్మ.. అతని గాయం గురించి ఆరా తీశారు. ఈ టోర్నమెంట్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ మ్యాచ్ సమయానికి రికవరీ కాకపోతే ప్రత్యామ్నాయం ఏమిటనే విషయంపై చర్చించారంటూ వార్తలొచ్చాయి.
#INDvsNZ | Dubai: Team India will take on New Zealand today in the Final match of the #ICCChampionsTrophy2025.
— ANI (@ANI) March 9, 2025
Friday's visuals from the Indian team's practice session at Dubai International Cricket Stadium.
(Pics - ANI Picture Service) pic.twitter.com/HpIvK8fK0X
ఈ పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. విరాట్ కోహ్లీ రికవరీ అయ్యాడని తెలిపింది. అతని గాయం సాధారణమేనని, కొద్దిగా విశ్రాంతి, తేలికపాటి ట్రీట్‌మెంట్, కొంత ఫిజియో ఎక్సర్‌సైజ్ తరువాత కోలుకున్నాడని పేర్కొంది. తుదిజట్టులో చోటు దక్కబోదనే అనుమానాలు వద్దని స్పష్టం చేసింది. ఫైనల్ ఆడతాడనడంలో సందేహాలు అక్కర్లేదని వివరించింది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications