IND vs AFG: అందుకే షమీని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే అఫ్గానిస్థాన్‌తో ఆడబోయే ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్‌లకు భారత జట్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని రెండు వేర్వేరు జట్ల వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం వెల్లడించాడు. అయితే ఈ రెండు సిరీస్‌లకు టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీసి సత్తా చాటినా మహమ్మద్ షమీని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. అజిత్ అగార్కర్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. అసలు తమ సెలెక్టర్లు షమీ గురించి చర్చించలేదని బదులిచ్చాడు.'ప్రస్తుతానికైతే షమీ కేవలం టీ20 క్రికెట్ ఆడటానికే సిద్ధంగా ఉన్నాడని మాకు సమాచారం అందింది. అందుకే మహ్మద్ షమీ ఎంపికపై ఎలాంటి చర్చ జరగలేదు'అని అగార్కర్ తెలిపాడు.

షమీ చివరిసారిగా టీమిండియా తరఫున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. టెస్ట్‌ల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో బరిలోకి దిగాడు. ఆ తర్వాత గాయాలతో జట్టుకు దూరమైన షమీ.. ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.
సెలెక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్ కుర్రాళ్లకు ప్రాధానత్య ఇస్తుండటంతో షమీకి అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమీ ఆ తర్వాత తేలిపోయాడు. 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు మాత్రమే తీసాడు. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 6 నుంచి 10 వరకు న్యూఛండీఘడ్ వేదికగా ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. జూన్ 14 నుంచి 20 వరకు నాలుగు వన్డేల సిరీస్ జరగనుంది.
అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్‌దూబే
అఫ్గాన్‌తో భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.












Click it and Unblock the Notifications