Surprise in the Skies: విమానంలో స్టాలిన్‌కు తారసపడ్డ అనుకోని అతిథి.. !!
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రస్తుతం స్పెయిన్ పర్యటనలో ఉన్నారు. శనివారమే ఆయన చెన్నై నుంచి స్పెయిన్‌కు బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జపాన్, సింగపూర్‌లల్లో పర్యటిస్తారు. ఎనిమిది రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది.
పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఆయన ఈ పర్యటనను చేపట్టారు. ఫిబ్రవరి 8వ తేదీన స్వదేశానికి తిరిగి వస్తారు. తన పర్యటనలో భాగంగా వివిధ మల్టీ నేషనల్ కంపెనీల యాజమాన్యంతో సమావేశమౌతారు. తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరిస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షోలను నిర్వహిస్తారు.

ఇటీవలే చెన్నైలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. ఆనంద్ మహీంద్ర, సునీల్ మిట్టల్.. వంటి దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు ఇందులో పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున ఆ సంస్థ డైరెక్టర్లు దీనికి హాజరయ్యారు. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
దీనికి కొనసాగింపుగా స్పెయిన్, జపాన్, సింగపూర్ పర్యటనలను చేపట్టారు స్టాలిన్. సింగపూర్‌కు చెందిన క్యాపిటాల్యాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ ఇప్పటికే తమిళనాడులో భారీ పెట్టుబడులను ప్రకటించింది. తన పర్యటన సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులను స్టాలిన్ కలుసుకుంటారు.
Surprise in the skies: Met #Tennis legend @DjokerNole en route to #Spain! 🎾 pic.twitter.com/VoVr3hmk5b
— M.K.Stalin (@mkstalin) January 29, 2024
కాగా- స్పెయిన్‌కు వెళ్లే విమానంలో లెజెండరీ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జొకొవిచ్.. ఎంకే స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిద్దరికీ ఒకే వరుసలో సీట్లు లభించాయి. అనుకోకుండా జొకొవిచ్‌ను కలుసుకోవాల్సి రావడం పట్ల స్టాలిన్ సంబర పడ్డారు. అతనితో ఫొటో దిగారరు. సర్‌ప్రైజ్ ఇన్ ద స్కై అంటూ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీన్ని పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications