ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కు బిగ్ షాక్- లీగ్ నుంచి ఏడాది బ్యాన్
ముంబై ఇండియన్స్ ప్లేయర్, సౌతాఫ్రికా ఆల్ రౌండర్ కార్బిన్ బాష్ కు భారీ షాక్ తగిలింది. అతడిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి ఏడాది పాటు బ్యాన్ చేసింది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దీంతో కార్బిన్ బాష్ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఏడాది పాటు పాల్గొనలేడు.
కార్బిన్ బాష్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బ్యాన్ చేయడానికి గల కారణం.. కార్బిన్ బాష్ ఇటీవల పీఎస్ఎల్ ఫ్రాంచైజీ అయిన పెష్వార్ జల్మీకు ఎంపికయ్యాడు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ లిజార్డ్ విలియమ్స్ గాయం కారణంగా లీగ్ కు దూరం అయ్యాడు. దీంతో కార్బిన్ బాష్ ను రీప్లేస్ మెంట్ గా తీసుకుంది.
అయితే పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఓకే సారి జరుగుతున్నాయి. ఈ రెండు టోర్నీలు ఒకేసారి జరుగుతుండడం వల్ల కార్బిన్ బాష్ ఐపీఎల్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్రమంలో పీఎస్ఎల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతడికి లీగల్ నోటీసులు పంపింది. అలాగే కార్బిన్ పై ఏడాది నిషేధం విధించింది.

అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కార్బిన్ బాష్ స్పందించాడు. పీఎస్ఎల్ నుంచి వైదొలగినందుకు అక్కడి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. 'పాకిస్థాన్ సెలబ్రిటీ లీగ్ ను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్ జట్టు మాత్రమే కాదు. ఇతర లీగ్ లో కూడా ముంబై ఫ్రాంచైజీలు ఉన్నాయి. అందుకే నా భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నా' అని బాష్ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications