భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు అమ్ముకున్న క్రికెట్ బోర్డు ఛైర్మన్..ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు
ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధం అయింది. ఫిబ్రవరి 19 అంటే బుధవారం నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది.తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. టీమిండియా ఈ టోర్నీలో గురువారం నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ అభిమానులు
ఎంతో అతృతుగా ఎదురు చూస్తోన్న ఇండియా - పాక్ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది.
ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు వీవీఐపీలు, సినిమా హీరోలు, రాజకీయా నాయకులు, ఇతర సెలబ్రెటీలు కూడా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వహకులు 30 వీఐపీ టిక్కెట్లను ఆఫర్ చేశారు. అయితే పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తనకు ఆఫర్ చేసిన వీఐపీ టిక్కెట్లను ఆయన అమ్ముకోవాలని చూస్తున్నారు.

దీనికి గల కారణం కూడా ఆయన వివరించారు.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌కు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆఫర్ చేసిన టికెట్ల ఖరీదు దాదాపు 94 లక్షల వరకు ఉంటుంది. అంత ఖరీదైన టిక్కెట్లు తీసుకొని, వీఐపీ బాక్స్‌లో సౌకర్యాలు పొందుతూ భారత్-పాక్ మ్యాచ్‌ను వీక్షించే కన్నా.. ఆ టిక్కెట్లను అమ్ముకొని వచ్చిన డబ్బుతో పాకిస్థాన్‌లోని క్రికెట్ స్టేడియాల అభివద్ధి కోసం ఉపయోగించాలని నఖ్వీ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు సైతం ఆయన తెలియజేశారు.అలా టికెట్లు అమ్మగా వచ్చిన డబ్బులతో పాకిస్థాన్ క్రికెట్ అభివృద్దికి ఉపయెగిస్తానని ఆయన తెలిపారు.తాను మాత్రం సాధారణ ప్రేక్షకులతో కలిసి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తానని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications