ఎంపీనే లైన్లో పెట్టిన టీమిండియా క్రికెటర్..చివరకు ఇలా ముగింపు

ఓ టీమిండియా క్రికెటర్ యవ్వారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా క్రికెటర్లు హీరోయిన్లతో డేటింగ్ చేస్తుంటారు. కానీ మనోడు మాత్రం ఏకంగా ఎంపీతోనే డేటింగ్ చేశాడు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. ఇలా ఎంపీతో డేటింగ్ చేసిన క్రికెటర్ మరెవరో కాదు..రింకూ సింగ్.క్రికెట్ ప్రపంచంలో తన విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన రింకూ సింగ్ త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.

క్రికెట్ స్టార్‌గా ఎదిగిన ఈ యువ ఆటగాడు, ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగు పెట్టిన ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. రింకూ సింగ్ అనగానే ఐపీఎల్‌లో ఐదు సిక్సర్ల విధ్వంసం, భారత జట్టులో అద్భుతమైన ఫినిషింగ్ టచ్ గుర్తొస్తాయి. తన నిరాడంబరమైన నేపథ్యం నుంచి అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిన రింకూ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఓ కీలక ఘట్టాన్ని చేరుకోబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ ఏడడుగులు వేయనున్నాడు.

Cricketer Rinku Singh married MP Priya Saroj

రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం జూన్ 8న లక్నోలోని ఓ లగ్జరీ 7-స్టార్ హోటల్‌లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి వివాహం నవంబర్ 18న వారణాసిలోని ఐకానిక్ తాజ్ హోటల్‌లో జరగనుంది. ఈ వివాహ వేడుకకు క్రికెట్, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

రింకూ సింగ్, సరోజ‌లది ప్రేమ వివాహం. ప్రియా , రింకూ సింగ్ ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా కలుసుకున్నారు. ఆ స్నేహితుడి తండ్రి కూడా ఒక క్రికెటర్ కావడంతో, క్రికెట్ నేపథ్యం వీరిని మరింత దగ్గర చేసింది.ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడాదికి పైగా వీరు డేటింగ్ చేసుకున్నారు.ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లికి రెడీ అయ్యారు. కుటుంబాలు వీరి వివాహానికి అంగీకారం తెలపడంతో, జనవరి 2025లోనే వీరి పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి.

ప్రియా సరోజ్ కేవలం 25 ఏళ్ల వయసులోనే మచ్లీషహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికై, భారతదేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా రికార్డు సృష్టించారు. ఢిల్లీ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీల నుండి డిగ్రీలు పొందిన ప్రియా, గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం యూపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.క్రికెట్ మైదానంలో తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టించిన రింకూ సింగ్, ఇప్పుడు ప్రియా సరోజ్‌తో కలిసి తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+