ఇంకోసారి 300 పరుగులు అంటే మూతి పగులుద్ది ..!
ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి అందరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో ఆ జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్‌కు చేరింది. దీంతో సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.గతానికి భిన్నంగా చాలామంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలిచారు.క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించింది.తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది.
ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది. తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్ రైజర్స్ ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అన్ని రంగాల్లో హైదరాబాద్ జట్టు విఫలం అయింది. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు, ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయారు. అభిషేక్ శర్మ, హెడ్, ఇషాంత్ కిషాన్, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్ వంటి అరవీర భయంకరమైన బ్యాట్స్‌మెన్లు జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో రాణించలేకపోతుంది. ఇక బౌలింగ్ విభాగానికి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

బ్యాట్స్‌మెన్ల పిచ్చిలో పడి, జట్టులో ఉన్న అద్భుతమైన ప్లేయర్లను సన్ రైజర్స్ యాజమాన్యం వదులుకుంది. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్,నటరాజన్ వంటి స్టార్ బౌలర్స్‌ను హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది. గతంలో సన్ రైజర్స్ టీం లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో అనేకసార్లు విజయం సాధించింది. 130 పరుగల లక్ష్యాన్ని కూడా ఆ జట్టు కాపాడుకున్న మ్యాచ్‌లు ఎన్నో చూశాం. అలాంటిది ఇప్పుడు 200 పరుగులు కొట్టినా గెలుస్తామనే ధీమా ఎక్కడా ఆ జట్టులో కనిపించడం లేదు.జట్టు కమిన్స్ మినహా ఆ జట్టులో పెద్దగా పేరున్న బౌలర్లు ఎవరూ లేరు.ఏది ఏమైనా 300 పరుగుల మోజులో పడి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సర్వ నాశనం అవుతుందనేది అక్షర సత్యం. 300 పరుగుల గురించి కాకుండా, ఆ జట్టు గెలుపు గురించి ఆలోచిస్తే మంచిదనే క్రికెట్ పండితులు సూచిస్తున్నారు. మరి ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం గ్రహిస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications