ఇక పులులు, సింహాలతో కంపేరిజను వద్దయ్యో
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది ఈ సీజన్‌లో వరుసగా రెండో ఓటమి. అంతుకుముందు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా ఓడిపోయిందీ ఎల్లో ఆర్మీ. పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ దిశగా సాగుతోందా జట్టు ప్రస్థానం.
చెన్నై చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ మళ్లీ విఫలం అయ్యాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

యువ ఆటగాడు ఆయుష్ మాత్రే తన అద్భుత ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో తొలి నాలుగు బంతుల్లో పరుగులను ఎదుర్కొనడానికి ఇబ్బంది పడ్డ ఆయుష్ అదే బార్ట్‌లెట్ ఓవర్ లో వరుసగా 3 ఫోర్లు కొట్టి దూకుడును ప్రదర్శించాడు. దీంతో పవర్ ప్లేలో చెన్నై 6 ఓవర్లలో 57 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆయుష్ మాత్రే కేవలం 29 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో రెండవది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆయుష్ రెండో వికెట్‌కు 96 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. గైక్వాడ్ నిలకడగా ఆడగా, ఆయుష్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు కొట్టి భారీ స్కోరుకు పునాది వేశాడు. చివరి ఓవర్లలో సర్ఫరాజ్ ఖాన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఈసారి తుది జట్టులోకి వచ్చి అర్ష్‌దీప్ ఓవర్‌లో వరుసగా 3 ఫోర్లతో 12 బంతుల్లో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు.
శివమ్ దూబే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 45 పరుగులు చేసి చెన్నైని 209/5కు చేర్చాడు. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ప్రియాంష్ ఆర్య 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కూపర్ కనోలీ 22 బంతుల్లో 36 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. గత గుజరాత్ మ్యాచ్‌లో కనోలీ షాట్‌కు గాయపడినప్పటికీ, శ్రేయాస్ కీలక అర్ధ శతకంతో తన నాయకత్వ పటిమను ప్రదర్శించాడు. పంజాబ్ బ్యాట్స్‌మెన్ల దూకుడైన ఆటతీరు ముందు చెన్నై బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. మాట్ హెన్రీ 4 ఓవర్లలో 54 పరుగులిచ్చి 2 వికెట్లు, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీసినా, లక్ష్యాన్ని కాపాడలేకపోయారు.
తన సొంత గడ్డ చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఆరోమ్యాచ్ ఓడిపోయినట్టయింది. గత ఐపీఎల్ లో వరుసగా అయిదు మ్యాచ్ లను ప్రత్యర్థులకు సమర్పించుకుందీ జట్టు. ఇప్పుడు ఇంకొకటి జత అయింది. వరుసగా ఆరింట్లో ఓడింది.












Click it and Unblock the Notifications