కోహ్లీ.. ఏమైందీ? అంత అసహనం ఎందుకు?
లక్నో: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్.. ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక. వరుసగా అయిదు విజయాలను సాధించిన టీమిండియా.. ఆరో గెలుపుపై కన్నేసింది. ఇప్పటివరకు ఆడిన అయిదింట్లోనూ జయకేతనం ఎగురవేసింది.
తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫస్ట్ ఇన్నింగ్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లన్నీ కూడా సెకెండ్ ఇన్నింగ్‌లో బరిలోకి దిగినవే. దీనికి భిన్నంగా- ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ ఆడుతోంది.

ఓపెనర్ శుభ్‌మన్ గిల్- 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. క్రిస్ వోక్స్ సంధించిన గుడ్ లెంగ్త్ డెలివరీని ఆడటంలో తికమకపడ్డాడు గిల్. ఈ లోగా ఆ బంతి మిడిల్ స్టంప్‌ను గాల్లోకి లేపింది.
శుభ్‌మన్ గిల్ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. తొమ్మిది బంతులను ఎదుర్కొన్న కోహ్లీ.. ఖాతా తెరవలేకపోయాడు. తొమ్మిది బంతుల తరువాత కూడా ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో అసహనానికి గురి అయినట్టు కనిపించాడు కోహ్లీ.
డేవిడ్ విల్లే వేసిన గుడ్ లెంగ్త్ బంతిని మిడాఫ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు గానీ సక్సెస్ కాలేకపోయాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని మిడాఫ్‌లో బెన్ స్టోక్స్ అందుకున్నాడు. దీనితో 27 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ పేరిట నమోదైన తొలి డకౌట్ ఇదే.












Click it and Unblock the Notifications