భారత్ 40/3: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్‌ ధరించిన రోహిత్ సేన..ఎందుకు?

లక్నో: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్.. ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక. వరుసగా అయిదు విజయాలను సాధించిన టీమిండియా.. ఆరో గెలుపుపై కన్నేసింది. ఇప్పటివరకు ఆడిన అయిదింట్లోనూ జయకేతనం ఎగురవేసింది.

తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫస్ట్ ఇన్నింగ్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లన్నీ కూడా సెకెండ్ ఇన్నింగ్‌లో బరిలోకి దిగినవే. దీనికి భిన్నంగా- ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ ఆడుతోంది.

CWC 2023, IND vs ENG: why India is wearing black armbands, here is the reason

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ- 18, కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్- 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. క్రిస్ వోక్స్ సంధించిన గుడ్ లెంగ్త్ డెలివరీని ఆడటంలో తికమకపడ్డాడు గిల్. ఈ లోగా ఆ బంతి మిడిల్ స్టంప్‌ను గాల్లోకి లేపింది.

శుభ్‌మన్ గిల్ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. తొమ్మిది బంతులను ఎదుర్కొన్న కోహ్లీ.. ఖాతా తెరవలేకపోయాడు. తొమ్మిది బంతుల తరువాత కూడా ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో అసహనానికి గురి అయినట్టు కనిపించాడు కోహ్లీ.

డేవిడ్ విల్లే వేసిన గుడ్ లెంగ్త్ బంతిని మిడాఫ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు గానీ సక్సెస్ కాలేకపోయాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని మిడాఫ్‌లో బెన్ స్టోక్స్ అందుకున్నాడు. దీనితో 27 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ పేరిట నమోదైన తొలి డకౌట్ ఇదే.

CWC 2023, IND vs ENG: why India is wearing black armbands, here is the reason

కోహ్లీ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్క్ వుడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వోక్స్ సంధించిన లెంగ్తీ డెలివరీని మిడాన్ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు అయ్యర్. టైమింగ్ మిస్ అయ్యాడు. టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతిని మార్క్ వుడ్ అద్భుతంగా అందుకున్నాడు. దీనితో 40 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నల్లరంగు ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి కనిపించారు టీమిండియా ప్లేయర్లు. జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో కేప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగిలిన ప్లేయర్ల చేతులకు ఈ బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్ కనిపించింది. దీనిపై ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

ప్లేయర్లు దీన్ని ధరించడానికి కారణం లేకపోలేదు. ఇటీవలే కన్నుమూసిన టీమిండియా లెజెండరీ ప్లేయర్ బిషన్ సింగ్ బేడీ మృతికి సంతాప సూచకంగా వారు దీన్ని ధరించారు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. బిషన్ సింగ్ బేడీకి నివాళి అర్పించేలా ఈ బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్‌ను ధరించినట్లు వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+