తాలిబన్ల ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్..!!
చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో మరో సంచలనం. మొన్నటికి మొన్న ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది ఆఫ్ఘనిస్తాన్. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే దూకుడును కంటిన్యూ చేస్తోందా జట్టు. ఆఫ్ఘనిస్తాన్ ప్రతాపానికి
ఈ సారి పాకిస్తాన్ బలి అయింది.
చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్‌ను రెండంటే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి కొట్టిపడేసింది ఆఫ్ఘన్.

ఈ క్రమంలో ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్- 87, రహ్మతుల్లా గుర్బాజ్- 65 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రహ్మత్ షా- 77, కేప్టెన్ హష్మతుల్లా షహీదీ- 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పాకిస్తాన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కంప్లీట్‌గా విఫలమైన మ్యాచ్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్లు పడగొట్టిన పిచ్‌పై పాక్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 49 ఓవర్లల్లో ఇద్దరిని మాత్రమే పెవిలియన్ పంపించగలిగారు. షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఈ టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ సాధించిన రెండో విజయం ఇది. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. మొత్తం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ ఆరంభానికి ముందు 10 స్థానంలో ఉన్న జట్టు ఇది. ఇంగ్లాండ్ ఇప్పుడు 10వ స్థానానికి పడిపోయింది.
ఐసీసీ వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై తమ దేశం పాకిస్తాన్‌ను ఓడించడంతో ఆఫ్ఘనిస్తాన్‌లో సంబరాలు మొదలయ్యాయి. రాజధాని కాబుల్ సహా ఇతర ప్రధాన నగరాల్లో పండగ వాతావరణం కనిపించింది. కాబుల్, ఖోస్ట్ ప్రావిన్స్‌లో అభిమానులు రోడ్లపైకి పోటెత్తారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ దేశ జాతీయ పతాకాలను ప్రదర్శించారు.
The celebrations in Afghanistan. pic.twitter.com/7d040PgQgM
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2023
కాబుల్‌లో తాలిబన్లు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ విజయాన్ని- తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. కాబుల్‌లో గుంపులు గుంపులుగా చేరుకున్న తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications