రాత్రికి రాత్రి మారిన ఈక్వేషన్స్- పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ చేరగలదా?
చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో మరో సంచలనం. మొన్నటికి మొన్న ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది ఆఫ్ఘనిస్తాన్. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే దూకుడును కంటిన్యూ చేస్తోందా జట్టు. ఆఫ్ఘనిస్తాన్ ప్రతాపానికి
ఈ సారి పాకిస్తాన్ బలి అయింది.
చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్‌ను రెండంటే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి కొట్టిపడేసింది ఆఫ్ఘన్.

ఈ క్రమంలో ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్- 87, రహ్మతుల్లా గుర్బాజ్- 65 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రహ్మత్ షా- 77, కేప్టెన్ హష్మతుల్లా షహీదీ- 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పాకిస్తాన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కంప్లీట్‌గా విఫలమైన మ్యాచ్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్లు పడగొట్టిన పిచ్‌పై పాక్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
49 ఓవర్లల్లో ఇద్దరిని మాత్రమే పెవిలియన్ పంపించగలిగారు. షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చవి చూసిన మూడో ఓటమి ఇది. వరుసగా మూడింట్లో ఓడిందాజట్టు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్స్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లల్లో విజయం సాధించింది.
ఆ తరువాత మూడింట్లో పరాజయం పాలైంది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో మట్టికరించింది. తాజా ఓటమి పాకిస్తాన్‌కు తేరుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆ జట్టుకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. మున్ముందు బలమైన జట్లను ఎదుర్కొనాల్సి ఉన్నందున- ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ రన్‌రేట్‌తో గెలవాలనే పాక్ ఆశలపై నీళ్లు కుమ్మరించిన మ్యాచ్ ఇది.
తన తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టాల్సి ఉంది బాబర్ ఆజమ్ సేనకు. ఈ నెల 27వ తేదీన ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ గేమ్ ఉంటుంది. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో తలపడాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పైనే ఓడిందంటే ఈ మూడు జట్లు కూడా పాకిస్తాన్‌ను భయపెట్టేవిగా తయారయ్యాయి.
రెండు విజయాలు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది పాకిస్తాన్. సెమీ ఫైనల్స్ చేరాలంటే లీగ్ దశ ముగిసేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది. ఆ స్థానాలను అందుకోవాలంటే కనీసం 12 పాయింట్లు అవసరమౌతాయి.. భారీ నెట్ రన్‌రేట్. ఈ 12 పాయింట్లు కావాలంటే ఆడబోయే నాలుగు మ్యాచ్‌లల్లో ప్రత్యర్థిని భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలోని తొలి నాలుగు స్థానాల్లో భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. వాటిని దాటుకోవాలంటే పాకిస్తాన్‌కు గగనం అయ్యేలా ఉంది.. ఇప్పుడా జట్టు ఆడుతున్న తీరు చూస్తోంటే. ఈ టోర్నమెంట్‌లో చెలరేగుతున్న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు దెబ్బతిన్న పులిలా ఉన్న ఇంగ్లాండ్‌ను ఓడించడం దాదాపు అసాధ్యమే అవుతుందని అంటున్నారు.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
HIV : 300కు పైగా చిన్నారులకు హెచ్ఐవి - డాక్టర్ నిర్లక్ష్యమే కారణం..!! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications