ఆఫ్ఘన్లను మెరికల్లా తీర్చిదిద్దిన భారత జట్టు మాజీ కేప్టెన్..!!
చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో మరో సంచలనం. మొన్నటికి మొన్న ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది ఆఫ్ఘనిస్తాన్. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే దూకుడును కంటిన్యూ చేస్తోందా జట్టు. ఆఫ్ఘనిస్తాన్ ప్రతాపానికి
ఈ సారి పాకిస్తాన్ బలి అయింది.
చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్‌ను రెండంటే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి కొట్టిపడేసింది ఆఫ్ఘన్.

పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 58, కేప్టెన్ బాబర్ ఆజమ్- 74, షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ 40 చొప్పున పరుగులు చేశారు. బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 49 ఓవర్లల్లో ఇద్దరిని మాత్రమే పెవిలియన్ పంపించగలిగారు. షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్- 87, రహ్మతుల్లా గుర్బాజ్- 65 పరుగులతో తొలి వికెట్ నష్టానికి 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే మ్యాచ్ వారి వశం అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రహ్మత్ షా- 77, కేప్టెన్ హష్మతుల్లా షహీదీ- 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చవి చూసిన మూడో ఓటమి ఇది. వరుసగా మూడింట్లో ఓడిందాజట్టు.
ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ స్ఫూర్తిదాయక విజయం వెనుక టీమిండియా మాజీ కేప్టెన్ అజయ్ జడేజా ఉన్నారు. అజయ్ జడేజా.. ప్రస్తుతం ఆ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తోన్నారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్.. ఆయనను
మెంటార్‌గా నియమించుకుంది.
టీమిండియా తరఫున అపారమైన క్రికెట్‌ను ఆడిన అనుభవం ఉన్న అజయ్ జడేజా.. ఆ జట్టు ప్లేయర్లను మెరికల్లా తీర్చిదిద్దారు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను సృష్టించగలిగారు. 282 పరుగుల స్కోరును ఆఫ్ఘనిస్తాన్.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిందంటే వారి బ్యాటింగ్ ఆర్డర్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘన్ బ్యాటర్లు ఈ స్థాయిలో బలోపేతం కావడంలో అజయ్ జడేజా ప్రమేయం ఉంది.
టీమిండియాలో హార్డ్ హిట్టర్‌గా పేరుంది అజయ్ జడేజాకు. మూడు వరల్డ్ కప్ టోర్నమెంట్లు ఆడిన భారత జట్టులో అతను సభ్యుడు. 196 మ్యాచ్‌లను ఆడిన అజయ్ జడేజా 5,359 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 37.47. 13 వన్డే ఇంటర్నేషనల్స్‌కు కేప్టెన్‌గా వ్యవహరించాడు. 15 టెస్టు మ్యాచ్‌ల్లో జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు.
ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అజయ్ జడేజాను మెంటార్‌గా అపాయింట్ చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఆ డెసిషన్.. అద్భుతమని తేలింది. అజయ్ జడేజాను ఎంపిక చేయడం గుడ్ ఛాయిస్ అని తేలింది. వరల్డ్ కప్ వంటి టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై తిరుగులేని విజయాన్ని సాధించేలా తీర్చిదిద్దగలిగాడు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications