మృతుల కుటుంబాలకు RCB 20 కోట్ల ప్రైజ్ మనీ..?

ఎట్టకేలకు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానుల ఆనందం క్షణికావేశంలోనే తీవ్ర విషాదంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘోరం జరిగినప్పటికీ, ఆర్సీబీ టీం తమ విజయోత్సవ వేడుకలను నిలిపివేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, క్రీడాభిమానులు, సామాజిక కార్యకర్తలు ఒక బలమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు: ఆర్సీబీకి దక్కిన రూ. 20 కోట్ల ప్రైజ్ మనీని, ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఇవ్వాలి.

Demand that RCB give 20 crore prize money to the families of the deceased

కేవలం కప్పు గెలిచామని సంబరాలు చేసుకోవడం కంటే, తమ కోసం ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు అండగా నిలబడటమే నిజమైన విజయోత్సవమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు ఆ కుటుంబాలకు కొంతమేరకైనా ఆసరా అవుతాయని, ఇది ఆర్సీబీకి ఒక బాధ్యతగా మారుతుందని డిమాండ్‌ చేస్తున్నారు. ఒక కప్పు విజయం కంటే, మానవత్వం, అభిమానుల పట్ల బాధ్యత ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఈ డిమాండ్‌పై ఆర్సీబీ యాజమాన్యం, బీసీసీఐ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+