రెండు నెలల్లోనే అతని మ్యాటర్ తెలిసిపోయింది.. టీమిండియా క్రికెటర్ భార్య సంచలన కామెంట్స్

టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట తర్వాత ఇరు కుటుంబాలకు ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.

ధనశ్రీ వర్మ తెలుగులో హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. అయితే కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడి విడిగా ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో యుజ్వేంద్ర చాహల్,ధనశ్రీ వర్మ విడాకులు తీసుకొంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.

Dhanashree Verma Makes Shocking Allegations Against Yuzvendra Chahal

చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమని అంతా భావించారు మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నారు.

తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్,ధనశ్రీ వర్మ విడాకుల తుది విచారణ సాగుతోంది.తాజాగా చాహల్ గురించి ధనశ్రీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రముఖ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్'లో పాల్గొన్న ధనశ్రీ, తమ విడాకులకు గల కారణాన్ని వెల్లడించింది.

తన సహ పోటీదారు కుబ్రా సైత్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తమ వైవాహిక బంధం విఫలమైందని పెళ్లైన మొదటి ఏడాదిలోనే, నిజానికి రెండో నెలలోనే గ్రహించానని ధనశ్రీ సంచలన విషయం చెప్పింది. నేను అతన్ని (చాహల్‌ను) పట్టుకున్నాను అంటూ ఆమె చేసిన ఆరోపణ చాహల్ మోసం చేశాడనే విషయాన్ని పరోక్షంగా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్న ఈ జంట, 2023లో విడిపోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. చివరకు 2025 మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు ద్వారా పరస్పర అంగీకారంతో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ధనశ్రీ రూ. 60 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. అయితే, చాహల్‌పై ఆమె చేసిన తాజా మోసం ఆరోపణలు క్రికెట్, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+