నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది

టీమిండియా మరో చారిత్రక ఘట్టానికి తెర తీయబోతోంది. టీ20 వరల్డ్ కప్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచివుంది. ఈ సాయంత్రం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. భారత్ గెలిస్తే- మూడోసారి టైటిల్ సాధించినట్టవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే, ఈ ట్రోఫీని గెలుచుకున్న ఏడో జట్టు అవుతుంది.

ఈ రెండూ కూడా ఐసీసీ టోర్నమెంట్ల మూడు ఫార్మాట్లు.. టెస్టులు, వన్డేలు, టీ20 ఫైనల్స్‌లో తలపడిన తొలి జట్లుగా చరిత్ర సృష్టించారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ఆకట్టుకుంది. గ్రూప్ దశలో అన్ని నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైనా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్, ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

Dhoni lands in Ahmedabad as India-NZ clash eyes T20 World Cup 2026 final at Narendra Modi Stadium

మొత్తం 30 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయి. టీమిండియా 18 విజయాలు (రెండు సూపర్ ఓవర్ గెలుపులతో సహా) నమోదు చేయగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్ డీఎల్‌ఎస్ నిబంధనల ప్రకారం టైగా ముగిసింది. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం రికార్డు భిన్నంగా ఉంది. ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది.

2007లో 10 పరుగులు, 2016లో 47 పరుగులు, 2021లో 8 వికెట్ల తేడాతో కివీస్ గెలిచింది. మొత్తంగా ఐసీసీ ఫైనల్స్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడటం నాలుగోసారి. గత మూడు ఫైనల్స్‌లో న్యూజిలాండ్ రెండుసార్లు, భారత్ ఒకసారి గెలిచాయి. 2000 అక్టోబర్ 15 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్‌లో, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కివీస్ గెలువగా, గత సంవత్సరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్లతో కివీస్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్ చూడటానికి టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన రాంచీ నుండి నేరుగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సాయంత్రం ధోనీ నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఆయన భార్య సాక్షి సింగ్ ధోనీ, కుమార్తె జివా సింగ్ ధోనీ స్టేడియానికి రానున్నారు. మరో మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ కూడా తన కుటుంబంతో కలిసి మ్యాచ్ ను తిలకించనున్నారు.

ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ, రోహిత్ శర్మ వాంఖెడేలో మెరిసిన విషయం తెలిసిందే. ధోనీ జెర్సీ నంబర్ 7 కావడం, సరిగ్గా ఏడు పరుగుల తేడాతో నాకౌట్ మ్యాచ్ లో భారత్ గెలవడంతో ఆయనను లక్కీ లెగ్ గా భావిస్తోన్నారు అభిమానులు. రెండు జట్లు కూడా సరిగ్గా ఏడు వికెట్లనే కోల్పోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+