ఆర్సీబీలో దినేష్ కార్తీక్ గ్రాండ్ రీఎంట్రీ
Dinesh Karthik: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్. ఐపీఎల్ 2025లో కొత్త అవతారంలో కనిపించబోతోన్నాడు. మొన్నటివరకు తాను ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోనే డిఫరెంట్ రోల్‌లో ముందుకు రానున్నాడు.
ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా అపాయింట్ అయ్యాడు దినేష్ కార్తీక్. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తనకు మరో అవకాశాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా నియమించిందని అన్నాడు.

ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ గెలవలేదని, ఆ డ్రీమ్‌ను ఫుల్ ఫిల్ చేయడమే తన ముందున్న లక్ష్యమని దినేష్ కార్తీక్ వివరించాడు. ఈ దఫా.. టైటిల్‌ను గెలిచి తీరేలా బ్యాటింగ్ ఆర్డర్‌ను తీర్చిదిద్దుతానంటూ ప్రామిస్ చేశాడు. బ్యాటింగ్ కోచ్‌గా తన జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలుపుతానని మాటిచ్చాడు.
ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడే రోజులు ఎంతో దూరంలో లేవని దినేష్ కార్తీక్ చెప్పాడు. త్వరలోనే కోట్లాది మంది అభిమానుల కల నెరవేరుతుందని అన్నాడు. ఈ జట్టుకు బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉందని, అమెరికాలో కూడా తనతో ఆటోగ్రాఫ్ తీసుకున్న అభిమానుల్లో ఆర్సీబీ వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పాడు.
Our new 𝗕𝗮𝘁𝘁𝗶𝗻𝗴 𝗖𝗼𝗮𝗰𝗵 𝗮𝗻𝗱 𝗠𝗲𝗻𝘁𝗼𝗿 𝘋𝘪𝘯𝘦𝘴𝘩 𝘒𝘢𝘳𝘵𝘩𝘪𝘬 loves RCB as much as our 12th Man Army loves him! ❤️
— Royal Challengers Bengaluru (@RCBTweets) July 1, 2024
He has a special message and an even more special promise for fans ahead of his new innings with us! 🎥#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/1E27Qwbatt
గతంలో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ ఆడాడు దినేష్ కార్తీక్. ఆ తరువాత ఆర్సీబీకి షిఫ్ట్ అయ్యాడు. మూడు సీజన్లుగా ఆ జట్టులో మెరుపులు మెరిపించాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ముగిసిన సీజన్‌తోనే రిటైర్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో కామెంటేటర్‌గా కనిపించాడు డీకే. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా ఆర్సీబీలో సెకెండ్ ఇన్నింగ్ మొదలుపెట్టనున్నాడు.












Click it and Unblock the Notifications