సెమీస్‌కు చేరిన బుడ్డోడి టీమ్!
Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తూర్పు జోన్ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా జరిగిన ఈ పోరులో ఈశాన్య జోన్‌పై ఇన్నింగ్స్, 210 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన తూర్పు జోన్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైనప్పటికీ.. షాబాజ్ అహ్మద్(167), సుదీప్ కుమార్(146) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోరు నమోదైంది.
సెంచరీ, వికెట్లతో రాణించిన షాబాజ్ అహ్మద్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈశాన్య జోన్ జట్టును తూర్పు జోన్ జట్టు బౌలర్లు తమ అద్భుతమైన బౌలింగ్‌తో బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్ లో ఈశాన్య జోన్ జట్టు కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. తూర్పు జోన్ బౌలర్లలో అభిజిత్ సర్కార్ 5 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నెముక విరచగా.. షాబాద్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అనుకుల్ రాయ్ చెరో వికెట్ సాధించగా.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ 9 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు.

ఫాలో-ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈశాన్య జోన్ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఈ సారి కూడా తూర్పు జోన్ స్పిన్ ధాటికి తాళలేక కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో అనుకుల్ రాయ్ 5 వికెట్లతో విజృంభించగా.. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 2 వికెట్లు తీశాడు. అలాగే ముఖేష్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిజీత్ సర్కార్ తలా ఒక వికెట్ పంచుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మహమ్మద్ షమీ 5 ఓవర్లు వేసినా వికెట్ సాధించలేకపోయాడు.
ఈ భారీ విజయంతో సెమీస్‌కు అర్హత సాధించిన తూర్పు జోన్.. తదుపరి రౌండ్లో గత ఎడిషన్ ఫైనలిస్టులైన సెంట్రల్ జోన్ లేదా సౌత్ జోన్లలో ఒకదానితో తలపడనుంది. మరొక క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్, వెస్ట్ జోన్ జట్్లు పోటీ పడుతుండగా.. విజేత సెమీస్‌కు చేరుకుంటుంది. ఆగస్టు 30 నుంచి సెమీస్ పోరు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.














Click it and Unblock the Notifications