అవును వాళ్లిద్దరూ విడిపోయారు..మరో టీమిండియా క్రికెటర్ సంచలనం
ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లు వరుసగా విడాకుల బాట పడుతున్నారు.సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారు.తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకున్నారు.చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకొంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది.చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు ఉంది.
ధనశ్రీ వర్మ తెలుగులో హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా చాహల్,ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు వీడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేస్తున్నాయి.ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది.

మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్,ధనశ్రీ వర్మ విడాకుల తుది విచారణ సాగుతోంది. తాజాగా ఈ జంట విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్టు చాహల్ తరపు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. 2022 నుంచే వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నట్టు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా తెలిపారు.తాజాగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వారి వైవాహిక బంధానికి శాశ్వతంగా ముగింపు పలికినట్టు అయింది. భరణం కింద రూ.4.75 కోట్లు ధన శ్రీకి ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్టు తెలుస్తోంది.దీనిలో భాగంగానే ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications