టీమిండియాలో ఆందోళనకర పరిణామం..

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొద్దిరోజుల్లో ఈ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.

ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

Flu Strikes Shubman Gill Just Before Asia Cup 2025 What It Means for India

ఈ పరిస్థితుల మధ్య భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ 2025 సన్నాహాలకు ఆటంకం ఎదురైంది. టీమిండియా టీ20 ఫార్మట్ వైఎస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యం బారిన పడ్డాడు. తీవ్ర జ్వరం, ఫ్లూతో బాధపడుతున్నాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్ లకు దూరం అయ్యాడు కూడా.

ఆసియా క ఓపెనింగ్ మ్యాచ్ లకు శుభ్ మన్ గిల్ ఎంతవరకు అందుబాటులో ఉంటాడనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ టోర్నమెంట్ మొదలయ్యే నాటికి గిల్ ను అందుబాటులోకి తీసుకుని రావాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో అతన్ని రిహాబిలిటేషన్ కు పంపించనుంది.

నిజానికి- ఈ వారంలో బీసీసీఐ.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంది. ఆసియా కప్‌కు రెండు వారాల లోపే సమయం ఉండటంతో, ఆ సమయానికి గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని టీమిండియా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

దులీప్ ట్రోఫీలో గిల్ అందుబాటులో లేకపోవడం వల్ల అంకిత్ కుమార్ నార్త్ జోన్‌ కేప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. ఆసియా కప్ కు ఎంపికైన పేస్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా కూడా యూఏఈ బయలుదేరే ముందు దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఆడనున్నారు.

ఆసియా కప్ కు ఎంపికైన భారత జట్టులో- సూర్య కుమార్ యాదవ్ (కేప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కేప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.

స్టాండ్‌బై: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+