మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ బ్యాటర్ రాబిన్ స్మిత్ 62 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను రాబిన్ స్మిత్‌తో హాంప్‌షైర్ తరఫున ఆడిన మాజీ ఆటగాడు కెవన్ జేమ్స్ బీబీసీ రేడియో సోలెంట్ ద్వారా వెల్లడించారు. రాబిన్ స్మిత్ మరణానికి గల కారణం ప్రస్తుతానికి తెలియరాలేదు. రాబిన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో పేస్ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
రాబిన్ స్మిత్ 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. రాబిన్ స్మిత్ టెస్టుల్లో 43.67 సగటుతో 4236 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన 9 శతకాలను బాదారు. ఆయన 1994లో వెస్టిండీస్‌పై 175 పరుగుల అత్యధిక స్కోరును నమోదు చేశారు. వన్డే క్రికెట్లో 71 వన్డే మ్యాచ్‌లు ఆడి 39.01 సగటుతో 2419 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. 1993లో ఆస్ట్రేలియాపై చేసిన 167 నాటౌట్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హాంప్‌షైర్ తరఫున తన మొత్తం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన స్మిత్.. 426 మ్యాచ్‌లలో 61 సెంచరీలతో సహా 26,155 పరుగులు చేశారు. ఆయన వేగవంతమైన బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొనేవాడని, ముఖ్యంగా వెస్టిండీస్ పేసర్ల ముందు నిలబడి ధీటుగా సమాధానం చెప్పిన అతికొద్ది మంది ఇంగ్లండ్ బ్యాటర్లలో ఆయన ఒకరని మాజీ సహచరుడు కెవన్ జేమ్స్ కొనియాడారు.

రిటైర్‌మెంట్ తర్వాత పోరాటం
క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత రాబిన్ స్మిత్ వ్యక్తిగత జీవితంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో, రిటైర్మెంట్ తర్వాత తాను ఎదుర్కొన్న పోరాటాల గురించి ఆయన బహిరంగంగా మాట్లాడారు. తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నట్లు, హోటల్‌కి వెళ్లి, మాత్రలు, మద్యం కలిపి తీసుకుని బాల్కనీ నుంచి దూకాలని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు. మద్యం వ్యసనం: తన తండ్రి అనారోగ్యం కారణంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చినప్పుడు, ఒంటరితనం, సోమరితనం కారణంగా తాను మళ్లీ మద్యపాన వ్యసనానికి లోనయ్యానని ఆయన అంగీకరించారు.
It is with great sadness that we announce the passing of legendary batter Robin Smith.
— Hampshire Cricket (@hantscricket) December 2, 2025
Known as 'The Judge', Smith played over 600 times for Hampshire and scored over 30,000 runs for the club in a career that spanned more than 20 years.
Our thoughts are with his family and… pic.twitter.com/eEB715R3pr
ఈసీబీ (ECB) ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ స్పందిస్తూ.. "రాబిన్ స్మిత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లను సైతం ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు కూడా నవ్వుతూ నిలబడిన ఆటగాడు. అతని అద్భుతమైన పోరాట పటిమ ఇంగ్లండ్ అభిమానులకు గర్వకారణం. హాంప్‌షైర్ క్రికెట్‌లో ఆయన రికార్డు ఆదర్శప్రాయమైనది, ఆయనను హాంప్‌షైర్ గొప్ప ఆటగాడిగా గుర్తుంచుకుంటారు. ఆయన మరణం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది" అని పేర్కొన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications