T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..!

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) సెమీస్ దశకు చేరుకుంది. గ్రూప్ దశలో వరుస విజయాలతో సూపర్ 8కు చేరిన జట్లతో పాటు ఒకట్రెండు మ్యాచ్ లు ఓడినా రెండో దశకు చేరిన జట్ల మధ్య సాగిన పోరు ముగిసింది. ఇప్పుడు మిగిలింది సెమీస్, ఫైనల్స్. ఇప్పటికే సూపర్ 8లో అజేయంగా నిలిచి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ కు అర్హత సాధిస్తే.. వీరితో పాటు భారత్, న్యూజీలాండ్ కూడా గ్రూపులో రెండో స్ధానంలో నిలిచి సెమీస్ కు చేరాయి.

ఈ నేపథ్యంలో రేపు దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ మధ్య తొలి సెమీ పైనల్, ఎల్లుండి భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరగబోతున్నాయి. వీటిలో కచ్చితంగా ఫైనల్ కు చేరే అర్హత ఉన్న జట్టుగా దక్షిణాఫ్రికాపై ఏకాభిప్రాయం వ్యక్తమవుతుండగా.. ఆ తర్వాత స్ధానాల్లో భారత్, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక వేళ దక్షిణాఫ్రికా సెమీస్ లోనూ గెలిచి అజేయంగా ఫైనల్ (T20 world cup final)కు చేరితే అక్కడ ఆ జట్టుతో పోటీ పడే మరో జట్టు ఏదన్న చర్చ నెలకొంది.

Former Pakistan Captain Mohammad Yousaf Names T20 World Cup Finalists South Africa and

దీనిపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ యూసఫ్ ఫైనల్లో ఆడే రెండో జట్టు ఏదో కూడా చెప్పేశాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్ ఆడే రెండో జట్టు భారతేనని యూసుఫ్ తేల్చిచెప్పేశాడు. ఫైనల్స్‌కు చేరుకునే జట్లకు, మిగిలిన జట్లకు మధ్య స్థాయి, నైపుణ్యాల గ్యాప్ భారీగా మారిందని యూసుఫ్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ లను మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దడానికి, మనకు త్వరలో రెండు ప్రత్యేక దశలు అవసరం కావచ్చన్నాడు. మొదటి ఆరు జట్లు ప్రధాన ఈవెంట్ లో చేరే ముందు అసోసియేట్ జట్లు గతంలో ఉన్న నాన్-క్వాలిఫైయర్‌లతో పోటీపడే దశ. ప్రస్తుతం ఫైనల్ చూస్తే దక్షిణాఫ్రికాకూ, భారత్ మధ్య జరిగేలా ఉందని మొహమ్మద్ యూసుఫ్ ట్వీట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+