గంభీర్ ఒక్కడే కాదు: రేసులోకొచ్చిన మాజీ ఆల్‌రౌండర్: చివరి నిమిషంలో ట్విస్ట్
Goutam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందనుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. చివరి నిమిషంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ తెరమీదికి వచ్చారు. గంభీర్‌తో పాటు రేసులో నిలిచారు. గట్టి పోటీ ఇస్తోన్నారు.
ఆయనే- డబ్ల్యూ వీ రామన్. తమిళనాడుకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్. బౌలింగ్ చేయగల సమర్థుడు. 1988 నుంచి 1997 వరకు జట్టులో కొనసాగాడు. భారత్ తరఫున వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచ్‌లను ఆడారు. తమిళనాడు తరఫున 132 ఫస్ట్ క్లాస్, 87 లిస్ట్- ఏ మ్యాచ్‌లు ఆడారు.

27 వన్డే మ్యాచ్‌లల్లో టీమిండియాకు ప్రాతినిథ్యాన్ని వహించిన డబ్ల్యూవీ రామన్.. 617 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 టెస్ట్ మ్యాచ్‌లల్లో 448 పరుగులు చేశారు. ఈ ఫార్మట్‌లో ఆయన హయ్యెస్ట్ స్కోర్.. 96. 1997లో దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆయన కేరీర్‌లో చివరిది. ఆ మరుసటి ఏడాడే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
టీమిండియా కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ దరఖాస్తు దాఖలు చేశారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్‌తో కలిసి పాల్గొన్నారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్ర, జతిన్ పరాంజపె ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. జూమ్ వీడియో కాల్ రూపంలో ఇవి జరిగాయి. ఈ సాయంత్రం రెండో రౌండ్ ఇంటర్వ్యూ జరగాల్సి ఉంది.
గంభీర్‌తో పాటు డబ్ల్యూ వీ రామన్ కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరైనట్లు క్రికెట్ అడ్వైజరీ కమిటీ ధృవీకరించింది. ఆయన తమతో మాట్లాడారని తెలిపింది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్ ఒక్కడే పోటీలో ఉన్నాడంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగినప్పటికీ- చివరి నిమిషంలో రామన్ ఈ రేసులో నిల్చున్నట్టయింది.
హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ఇదివరకే ముగిసింది. జూన్ 29వ తేదీ నాటికే ఆయన కాల పరిమితి ముగిసింది. దాన్ని రెన్యూవల్ చేయలేదు. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఆయనను అదే హోదాలో కొనసాగిస్తోంది. ఈ నెల 29వ తేదీన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్.
దీని తరువాత టీమిండియా హెడ్ కోచ్ పేరును బీసీసీఐ ప్రకటిస్తుంది. గంభీర్‌తో పాటు ఇప్పుడు డబ్ల్యూవీ రామన్ కూడా లైన్‌లో ఉండటం వల్ల ఈ ప్రిస్టేజియస్ పదవికి ఎవరికి వరిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. బీసీసీఐ మాత్రం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలపడం గంభీర్‌కు ప్లస్ పాయింట్ కానుంది.












Click it and Unblock the Notifications