గౌతమ్ గంభీర్‌‌కు గుడ్‌బై చెప్పిన కోల్‌కత నైట్ రైడర్స్

Gautam Gambhir: కోల్‌కత నైట్ రైడర్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో జట్టను ఛాంపియన్ నిలిపిన అతన్ని వదులుకుంది కేకేఆర్ ఫ్రాంఛైజీ. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో ఫేర్‌వెల్ ఫంక్షన్ సైతం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌ టీమ్‌లో గంభీర్ కనిపించడు.

దీనికి కారణం లేకపోలేదు. గంభీర్- భారత జట్టు హెడ్ కోచ్‌గా అపాయింట్ కాబోతోన్నాడు. అతని నియామకం దాదాపుగా ఖరారైనట్టే. దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రేపో, మాపో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Gautam Gambhir attended his farewell video shoot at the Eden Gardens

ఇదివరకే హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ పూర్తి చేసింది కూడా. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్‌ను ఇంటర్వ్యూ నిర్వహించింది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి వచ్చింది బీసీసీఐకి. ఆ ఉద్దేశంతోనే రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు.

ఈ రేసులో గౌతమ్ గంభీర్ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచాడు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం, ఐపీఎల్‌లో తాను మెంటార్‌గా ఉంటోన్న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడం ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూవీ రామన్ కంటే గంభీర్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. కొత్త బాధ్యతలను స్వీకరించడం దాదాపుగా ఖాయమైంది.

టీ20 వరల్డ్ కప్‌లో గెలిచిన జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు రాహుల్ ద్రావిడ్. అదే అతనికి చివరి బిగ్గెస్ట్ టోర్నమెంట్. అతని హెడ్ కోచ్ పదవీ కాలాన్ని పొడిగించడానికి బీసీసీఐ ఆసక్తి చూపలేదు. టీ20 వరల్డ్ కప్‌ ఫలితం తేలే సమయానికి కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను సైతం పూర్తి చేసింది. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా కూడా రాహుల్ ద్రావిడ్ ఆ పని చేయలేదు.

ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ఎన్నిక దాదాపు ఖరారైన నేపథ్యంలో కోల్‌కత నైట్ రైడర్స్ అతనికి ఫేర్ వెల్ పార్టీ ఇచ్చింది. గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రాంఛైజీ హెడ్స్ పాల్గొన్నారు. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, సపోర్టింగ్ స్టాఫ్ అటెండ్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+