Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీమిండియాలో పాపాల భైరవుడు

టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. 76 పరుగుల తేడాతో ఓటమి టోర్నమెంట్ చరిత్రలో భారత్‌కు అతిపెద్ద పరాజయం రికార్డును నమోదు చేసింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా సెమీ ఫైనల్స్ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. దాదాపు ద్వారాలు మూసుకుపోయాయి.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ ఆది నుంచీ తడబడింది. పూర్తి ఓవర్లు కూడా ఆడకుండా చేతులెత్తేసిందంటే సఫారీల బౌలింగ్ పదును ఏ స్థాయంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఓటమితో టీ20 ప్రపంచ కప్ లో భారత్‌కు సెమీఫైనల్ చేరే మార్గం కఠినంగా మారింది.

Gautam Gambhir Under Fire Over Washington Sundar Pick After T20 World Cup South Africa Showdown

ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ నిరాశపరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆల్ రౌండర్, వైస్ కేప్టెన్ అక్షర్ పటేల్ స్థానంలో అతన్ని చివరి నిమిషంలో తుదిజట్టులోకి వచ్చాడు. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. తొలుత బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో నిరాశపరిచాడు. ఇది- హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పీకకు చుట్టుకుంది. అతను విమర్శల పాలవుతున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయాలనే వ్యూహాత్మక నిర్ణయం జట్టు కూర్పు, వ్యూహాలపై తీవ్ర చర్చకు దారితీసింది.

బ్యాటింగ్‌లో అయిదో స్థానంలో దిగిన వాషింగ్టన్ సుందర్ 11 బంతుల్లో 11 పరుగులు చేశాడు. అంతకుముందు తన రెండు ఓవర్ల బౌలింగ్‌లో వికెట్ తీయకుండా 17 పరుగులు సమర్పించుకున్నాడు. సుందర్ ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని సూర్యకుమార్ యాదవ్ ముందుగానే ఒప్పుకొన్నాడు కూడా. టాస్ వద్దే ఈ విషయం చెప్పాడు. అక్షర్ పటేల్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడం వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే పేర్కొన్నాడు.

అక్షర్ స్థానంలో సుందర్ ఎంపిక వ్యూహాత్మక అంచనాతో జరిగింది. దక్షిణాఫ్రికా టాప్ 5లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. అక్షర్ ఎడమచేతి వాటం స్పిన్నర్ కావడంతో ప్రొటీస్ బ్యాటర్లు అతడిని సులువుగా ఎదుర్కోవచ్చని భావించారు. ఈ లెఫ్ట్ హ్యాండర్లపై వాషింగ్టన్ సుందర్ రాణిస్తాడని అనుకున్నారు. సుందర్ ను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయాడు సూర్యకుమార్ యాదవ్. సుందర్‌ను ఏడో ఓవర్‌లో దించాడు. ఆ ఓవర్‌లో బ్రెవిస్, మిల్లర్ 11 పరుగులు రాబట్టారు.

తదుపరి ఓవర్‌లోనే వరుణ్ చక్రవర్తిని బౌలింగ్‌కు దించగా, అతను కూడా బ్యాటర్లకు 17 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇరువైపుల నుంచి పరుగుల వరద పారుతున్నా సుందర్‌ను 14వ ఓవర్ వరకు తిరిగి బౌలింగ్‌కు తీసుకురాలేదు. ఆ ఓవర్‌లో అతను ఆరు పరుగులు ఇచ్చిన తర్వాత, మళ్లీ బౌలింగ్ చేయించలేదు. సుందర్ ప్రయోగం పూర్తిగా విఫలం కావడంతో అభిమానులు గంభీర్, జట్టు యాజమాన్యంపై మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+