IPL 2024: హార్దిక్ బ్యాక్, రోహిత్ ఔట్ - భారీ మార్పులు..!!

క్రికెట్ ప్రపంచ కప్ ముగిసిన తరువాత ఇప్పుడు ఐపీఎల్ టీంల ఆక్షన్ పైన ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రపంచ కప్ లో రాణించిన ప్లేయర్లకు డిమాండ్ కనిపిస్తోంది. గత సీజన్ లో ఆట తీరు..ప్రస్తుత ఫాం చూసిన తరువాత తుది అంచనాలు సిద్దమవుతున్నాయి. ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకోవటం..వదిలించుకోవటం పైన తుది నిర్ణయం తీసుకొనే సమయం దగ్గరపడింది. ఇప్పుడు అనూహ్యమైన మార్పుల దిశగా ఐపీఎల్ టీంల కూర్పు సిద్దం అవుతోంది.

ఐపీఎల్ ఆక్షన్ పై ఆసక్తి: డిసెంబరు 19న ఐపీఎల్‌ 2024 కోసం దుబాయ్‌లో మినీ ఆటగాళ్ల వేలం జరగనుంది. దీంతో ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదిలించుకోవాలనే విషయమై ఆయా జట్లు తలమునకలై ఉన్నాయి. ఈనెల 26లోపు అన్ని జట్లు తమ జాబితాలను ఐపీఎల్‌ పాలకమండలికి సమర్పించాల్సి ఉంటుంది.

Gujarat Titans captain Hardik Pandya could be on his way back to Mumbai Indians

దీని కోసం పది ఫ్రాంచైజీలు తమ బలాబలాలను బేరీజు వేసుకునే పనిలోపడ్డాయి. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా... జోఫ్రా ఆర్చర్‌ స్థానంలో ముంబై జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే రోహిత్‌ శర్మ గుజరాత్‌కు వెళ్తాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, ముంబాయి టీం రోహిత్ ను కొనసాగించే ఆలోచనలో ఉందని చెబుతున్నారు.

మారుతున్న లెక్కలు: క్రితం వేలంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా సామ్‌ కర్రాన్‌ చరిత్ర సృష్టించాడు. పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఏకంగా రూ.18.50 కోట్లకు కొనుగోలు చేయగా, ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు మాత్రమే తీసి దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఈసారి పంజాబ్‌ అతడిని వదిలేసి భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవాలనుకుంటోంది.

అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతానని ప్రకటించిన స్టోక్స్‌ను సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిలీజ్‌ చేయాలనుకుంటోంది. అతడిపై రూ.16.25 కోట్లు వెచ్చించినా ఆడింది రెండు మ్యాచ్‌లే. మరోవైపు రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీగా ఆశలు పెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు.

ఏ టీంలో ఎవరికి ఛాన్స్: కేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌లను కూడా వదిలేసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే రస్సెల్‌పై ఇంకా నమ్మకమున్నట్టు చెబుతున్నారు. అలాగే పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఫెర్గూసన్‌, సౌథీ, షకీబ్‌, లిట్టన్‌ దాస్‌, డేవిడ్‌ వీస్‌ వేలంలో కనిపించనున్నారు. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్‌ అందించడంలో కీలకంగా వ్యవహరించిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌పై వేలంలో అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించే అవకాశం ఉంది.

గతేడాది డిసెంబరులో జరిగిన వేలంలో హెడ్‌ను ఏ జట్టూ పట్టించుకోలేదు. అలాగే కివీస్‌ ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర కూడా వన్డే వరల్డ్‌క్‌పలో 578 పరుగులతో విశేషంగా ఆకట్టుకున్నాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌గా సేవలందించగలడు. దీంతో ఇతడిపైనా లుక్కేయడం ఖాయమే. ఎనిమిదేళ్ల తర్వాత ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా వేలానికి రాబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+