హార్దిక్ పాండ్యాకు మరో బ్రేకప్..?
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి, సింగర్ జాస్మిన్ వాలియా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా వీళ్లిద్దరూ ఇన్ స్టాలో అన్ ఫాలో అయినట్లు సమాచారం. గతంలో హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నటి జాస్మిన్ వాలియా రిలేషన్ లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి చాలాసార్లు కెమెరాకు చిక్కారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ లకూ వాలియా హాజరైంది. అయితే తాజాగా వీరు తమ రిలేషన్ కు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో అయినట్లు సమాచారం.
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి జాస్మిన్ వాలియా మధ్య బ్రేకప్ రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. ఇద్దరూ ఇన్‌స్టాలో అన్ ఫాలో చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్ సమయంలో పాండ్యా కు సపోర్ట్ గా నిలిచిన జాస్మిన్.. ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ కు పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. వీళ్లిద్దరూ పరస్పరం అంగీకారంతోనే విడిపోయినట్లు వెల్లడించారు.

ఇక తాజాగా నటి జాస్మిన్ వాలియాతో బ్రేకప్ విషయం బయటకి రావడంతో పాండ్యా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ కే ఇలా జరుగుతుందేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా తరఫున ఆడనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ టోర్నమెంటులో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇది యూఏఈలో నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications