టీ20ల్లో రోహిత్ శర్మ వారసుడు అతడే ? తేల్చేసిన జై షా ..!

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సాధించిన అపూర్వ విజయం తర్వాత జట్టులో పెనుమార్పులు తప్పడం లేదు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ విరాట్ కొహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వంటి వారు పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో వీరి వారసులపై అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో కెప్టెన్సీ విషయంలో మాత్రం రోహిత్ శర్మ వారసుడిపై బీసీసీఐ క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

భారత టీ20 జట్టు కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రిటైర్ అయిన నేపథ్యంలో అతని వారసుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. గతంలో రోహిత్ గైర్హాజరీలో జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యహరించిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఈసారి పూర్తిస్థాయి కెప్టెన్ గా నియమించే విషయంలో సెలక్టర్లతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామని జై షా వెల్లడించారు. తద్వారా టీ20 కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా విషయంలో తాము సానుకూలంగా ఉన్నామన్న సంకేతాలు ఇచ్చేశారు.

Hardik Pandya likely to replace Rohit Sharma as T20I captain

"కెప్టెన్సీని సెలక్టర్లు నిర్ణయిస్తారని, వారితో చర్చించిన తర్వాత దీనిపై ప్రకటన చేస్తామని జై షా వెల్లడించారు. హార్దిక్ గురించి చాలా మంది తమను అడిగారని, అతని ఫామ్‌పై చాలా ప్రశ్నలు ఉన్నాయని, కానీ తాము, సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచినట్లు జై షా తెలిపారు. అదే సమయంలో హార్దిక్ కూడా తనను తాను నిరూపించుకున్నాడని జై షా ప్రశంసించారు. తద్వారా టీ20 కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ముందున్నాడని జై షా చెప్పకనే చెప్పేశారు.

Hardik Pandya likely to replace Rohit Sharma as T20I captain

అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేలో జరిగే 5 మ్యాచ్ ల టీ20 టోర్నీకి మాత్రం భారత కెప్టెన్ గా ఓపెనర్ శుభ్ మన్ గిల్ వ్యవహరించబోతున్నాడు. జూలై 6 నుంచి ఈ టోర్నీ హరారేలో ప్రారంభం కానుంది. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ కు వెళ్లిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్న గిల్ కు అక్కడ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్లతో గిల్ కు మార్గం సుగమం కాబోతోంది. ఈ టోర్నీ తర్వాత టీ20 ఫుల్ టైమ్ కెప్టెన్ గా హార్ధిక్ ను ప్రకటించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+