టీమిండియా మాజీ కేప్టెన్ అజరుద్దీన్‌ పేరు తొలగింపు- ఆదేశాలు

Azaruddin: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదానికి కేంద్రబిందువు అయింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓ పెవిలియన్ స్టాండ్‌కు పెట్టిన భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్, హైదరాబాద్‌కే చెందిన మహ్మద్ అజరుద్దీన్ పేరును తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇది కాస్తా వివాదాన్ని రేపుతోంది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎథిక్స్ ఆఫీసర్, అంబుడ్స్‌మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్‌ స్టేడియం నార్త్ పెవిలియన్ స్టాండ్‌కు మహ్మద్ అజారుద్దీన్ పేరు కొనసాగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. టీమిండియా ప్లేయర్‌గా, కేప్టెన్‌గా క్రికెట్‌కు అజరుద్దీన్ అందించిన సేవలకు గుర్తింపుగా 2019లో నార్త్ పెవిలియన్ స్టాండ్‌కు ఆయన పేరు పెట్టారు.

HCA Orders Removal of Former India s captain Azharuddin s Name from Uppal Stadium Stand

సౌత్ పెవిలియన్ స్టాండ్‌కు హైదరాబాద్‌కే చెందిన మరో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరును పెట్టారు. 2019 డిసెంబర్‌లో భారత్- వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఈ రెండు స్టాండ్లను ఆవిష్కరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ అప్పట్లో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో అజరుద్దీన్ హాజరయ్యారని, నార్త్ పెవిలియన్ స్టాండ్‌కు తన పేరును పెట్టాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు లార్డ్స్ క్రికెట్ క్లబ్ కోశాధికారి సోమ్నా మిశ్రా హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు.

నార్త్ పెవిలియన్ స్టాండ్‌కు అజరుద్దీన్ పేరు పెడుతూ అపెక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం 2018 నాటి హెచ్‌సీఏ రూల్ 38కు వ్యతిరేకమని సోమ్నా మిశ్రా వాదించారు. ఈ రూల్ ప్రకారం- ఆఫీస్ బేరర్లు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. అదే సమయంలో- సర్వసభ్య సమావేశం ఆమోదంతో సౌత్ పెవిలియన్ స్టాండ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ పేరు పెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తలేదు.

స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటూ కనిపించే నేమ్ బోర్డుపై అదనంగా ఎలాంటి పేర్లను కూడా పెట్టకూడదనే నిబంధన సైతం రూల్ బుక్‌లో ఉందని చెబుతున్నారు. అలాంటి నేమ్ బోర్డు ఏదైనా పెట్టాల్సి వస్తే హెచ్‌సీఏ సర్వ సభ్య సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుందని, అలాంటిదేదీ జరగలేదని సోమ్నా మిశ్రా తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

అంబుడ్స్‌మన్ విచారణకు అజరుద్దీన్ కూడా హాజరయ్యారు. తన వాదనలను వినిపించారు. తన పేరు విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అపెక్స్ కౌన్సిల్‌పై తాను ఎలాంటి ఒత్తిడినీ తీసుకుని రాలేదని అన్నారు. ఆ నిర్ణయం ఏకగ్రీవమని తెలిపారు. ఆ తరువాత జరిగిన సర్వసభ్యసమావేశాల్లోనూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని వివరణ ఇచ్చారు. పేరు పెట్టడం వల్ల వ్యక్తిగత ఎలాంటి లబ్ది పొందలేదని చెప్పారు.

ఈ వాదోపవాదాలను విన్న అనంతరం ఎథిక్స్ ఆఫీసర్.. అజరుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించారు. మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతి రాజు పేర్ల ప్రస్తావన కూడా ఎప్పుడూ రాకపోవడాన్ని ప్రస్తావించారు. రూల్ 38, రూల్ 41ను ఉల్లంఘించడం సరైనది కాదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+