IPL Auction 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద ఇంకా ఎంత డబ్బు ఉంది..!
ఐపీఎల్ వేలం 2025కి సర్వ సిద్ధమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు వేలం ప్రారంభం కానుంది. వేలంలో 10 ప్రాంచేజీలు పాల్గొనున్నాయి. వేలంలో పాల్గొనడానికి ప్రతి ప్రాంచేజీకి కొంత డబ్బు కేటాయిస్తారు. ఆ డబ్బుకు లోబడే ప్రాంచేజీ ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు జట్లు తమ వద్ద ఉన్న డబ్బును ఉపయోగించి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇప్పుడు మిగిలిన డబ్బుతో ప్రాంచేజీలు వేలంలో పాల్గొనున్నాయి.
10 ఫ్రాంచైజీలు మొత్తం 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. కేకేఆర్, ఆర్ఆర్ ఆరుగురు చొప్పున ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీని రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఆ జట్టు వద్ద రూ.55 కోట్లు ఉన్నాయి.ఢిల్లీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ తిరిగి తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.73 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ ను రిటైన్ చేసుకుంది.
ఐపీల్ వేలం 2025 LIVE: మెగా వేలంలో ఆ అదృష్టవంతుడు ఎవరు..?

గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.60 కోట్లు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్ ను రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జట్టు వద్ద రూ. 51 కోట్లు ఉన్నాయి. ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని తిరిగి తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.69 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది. ఆ జట్టు వద్దు ఇప్పుడురూ. 45 కోట్లు ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ రిటైన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా 110 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మను తిరిగి తీసుకుంది. ఇప్పుడు ఆ జట్టు వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్ ను రిటైన్ చేసుకోగా.. వారి వద్దు ఆర్సీబీ వద్ద రూ.83 కోట్లు ఉన్నాయి.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ ను రిటైన్ చేసుకోగా.. ఇప్పుడు జట్టు వద్ద వద్ద రూ.45 కోట్లు ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కామ్ బ్యాటర్ క్లాసెన్‌ను తొలి ఆప్షన్‌గా తీసుకొని అతనికి రూ. 23 కోట్లు ఇచ్చింది. కమిన్స్‌కు 18 కోట్లు, అభిషేక్ 14 కోట్లు, హెడ్‌కు 14 కోట్లు యంగ్‌స్టర్ నితీశ్‌ను రూ. 6 కోట్లతో తిరిగి తీసుకుంది. వీరి కోసం ఈ ఐదుగురి కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 45 కోట్లతోనే వేలంలో పాల్గొననుంది.
ఏదైనా టీమ్ లో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. కనిష్ఠంగా 21 నుంచి 23 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. ఏ జట్టులోనైనా గరిష్ఠంగా 8 మంది విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉంది. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ఐదుగురిని రిటైన్ చేసుకుంది. అంటే ఇంకా గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. కనిష్ఠంగా 16 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ముగ్గురు విదేశీ ఆటగాళ్లని తీసుకున్నారు కాబట్టి ఇంకా 5 గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇప్పుడు సన్ రైజర్స్ కు స్పిన్నర్లు, బ్యాటర్లు, బౌలర్లు కావాలి. రూ.45 కోట్లతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications