IPL Auction 2025: వేలంలో పాల్గొనడానికి ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందంటే..!

ఐపీఎల్ వేలానికి 10 ప్రాంచేజీలు సిద్ధమయ్యాయి. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు వేలం ప్రక్రియ ప్రారంభం అయి రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. సోమవారం కూడా ఇదే సమయంలో వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే 10 జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. కేకేఆర్, ఆర్ఆర్ ఆరుగురు చొప్పున ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. మిగతా టీమ్ లు వారికి నచ్చిన సంఖ్యలో ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే కేవలం ఆరుకు ఆటగాళ్లు మాత్రమే తిరిగి తీసుకునే అవకాశం ఉంది.

వేలంలో పాల్గొబోయే జట్లకు కొంత డబ్బు కేటాయిస్తారు. ఆ డబ్బుకు సరిపడ మాత్రమే ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రాంచేజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకుని కొంత డబ్బును ఖర్చు చేశాయి. మిగిలిన డబ్బులతో ఇప్పుడు వేలంలో పాల్గొనున్నాయి. ప్రస్తుతం ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందో చూద్దాం..

ఐపీల్ వేలం 2025 LIVE: కాసుల వర్షం ఎవరిపై కురుస్తుంది..?

How much money does each team have to participate in the IPL auction 2025

చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.55 కోట్లు ఉన్నాయి. వీరు ఈ డబ్బుతో 21 మంది స్వదేశీ ఆటగాళ్లు, ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.73 కోట్లు ఉన్నాయి. వీరు ఈ డబ్బుతో 21 మంది స్వదేశీ ఆటగాళ్లు, ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. కోల్ కత్తా నైట్ రైడర్స్ వద్ద రూ. 51 కోట్లు ఉన్నాయి. వీరు ఈ డబ్బుతో 19 మది స్వదేశీ ఆటగాళ్లు, ఆరుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఆర్సీబీ వద్ద రూ.83 కోట్లు ఉన్నాయి. వీరు ఈ డబ్బుతో 22 మంది స్వదేశీ ఆటగాళ్లు, 8 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి. వీరు ఈ డబ్బుతో 19 మంది స్వదేశీ, ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.69 కోట్లు ఉండగా.. వీరు 20 మంది స్వదేశీ ఆటగాళ్లను, ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ముంబై ఇండియన్స్ వద్ద రూ. 45 - కోట్లు ఉండగా.. వీరు 20 మంది స్వదేశీ ఆటగాళ్లు, ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.45 కోట్లు ఉన్నాయి. వీరు ఈ డబ్బుతో 20 స్వదేశీ ఆటగాళ్లను, ఐదుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.60 కోట్లు ఉండగా.. 20 మంది స్వదేశీ ఆటగాళ్లను, ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా 110 కోట్లు ఉన్నాయి. వీరు కేవలం కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకున్నారు. అందుకే వీరి వద్ద డబ్బు ఎక్కువగా ఉంది. వీరు ఈ డబ్బుతో 23 మంది స్వదేశీ ఆటగాళ్లు, ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు కొనుగోలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+