పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన టీమిండియా, 2026 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.

ఈ విజయంతో స్వదేశీ గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా మాత్రమే కాకుండా, వరుసగా రెండు టీ20 టైటిళ్లను నెగ్గిన మొదటి దేశంగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్‌కు ఇది వరుసగా మూడో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం.

How Much Prize Money Will Pakistan Get from ICC T20 World Cup 2026 Earnings for Super 8 Teams Revealed

కాసుల వర్షం.. రికార్డు స్థాయి బహుమతులు!

విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుపై ఐసీసీ కాసుల వర్షం కురిపించింది. చారిత్రక విజయం సాధించిన రోహిత్ సేనకు సుమారు ₹21.5 కోట్లు (2.34 మిలియన్ డాలర్లు) భారీ నగదు బహుమతి లభించింది. రన్నరప్‌గా నిలిచిన కివీస్ జట్టుకు ₹10.75 కోట్లు అందాయి. ఇక టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు కూడా వారి ప్రదర్శన ఆధారంగా కోట్లాది రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. సెమీ ఫైనలిస్టులకు ₹6.20 కోట్లు రాగా, సూపర్ ఎయిట్ దశలో నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టుకు ₹2.48 కోట్లు దక్కాయి. గెలిచిన ప్రతి మ్యాచ్‌కు అదనంగా మరో ₹28.64 లక్షల ఇన్సెంటివ్స్ లభించడం విశేషం.

ఆసీస్‌తో పోలిక.. గంభీర్ ఘాటు వ్యాఖ్యలు!

వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గడంతో, 1999-2007 మధ్య కాలంలో ఆస్ట్రేలియా సృష్టించిన ఆధిపత్యంతో ప్రస్తుత భారత జట్టును చాలా మంది పోలుస్తున్నారు. అయితే, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈ 'యుగాల' (Eras) పోలికపై తనదైన శైలిలో స్పందించారు. "వైట్-బాల్ క్రికెట్‌లో భారత్ ఒక యుగాన్ని సృష్టిస్తోందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఇది నిజంగా ఒక యుగం అయితే, గత మూడు వన్డే సిరీస్‌లలో రెండింటిని మనం ఓడిపోయేవాళ్లం కాదు కదా!" అంటూ గంభీర్ వ్యంగ్యంగా నవ్వారు.

ట్రోఫీ ఏదైనా.. గెలుపే ముఖ్యం!

గంభీర్ దృష్టిలో ఐసీసీ ట్రోఫీలకు, ద్వైపాక్షిక సిరీస్‌లకు పెద్దగా తేడా లేదు. ఐసీసీ టోర్నీల్లో భారత్ అద్భుత రికార్డు కలిగి ఉన్నప్పటికీ, ఆయన మాత్రం ప్రతి మ్యాచ్‌ను సమానంగానే చూస్తానని స్పష్టం చేశారు. "మనం దేశం కోసం ఆడుతున్నప్పుడు అది వరల్డ్ కప్ ఫైనల్ అయినా, ద్వైపాక్షిక సిరీస్ అయినా.. గెలవడమే ప్రధాన లక్ష్యం కావాలి. నాకు వీటి మధ్య ఎటువంటి భేదం కనిపించదు," అని గంభీర్ వివరించారు. ఈ వ్యాఖ్యలతో గంభీర్ తన విలక్షణమైన శైలిని మరోసారి చాటుకున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+