T20 ప్రపంచ కప్ వేళ క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!?
మరి కొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా పూర్తి జోష్ మీద ఉండటంతో క్రికెట్ అభిమానులకు ఈ టోర్నీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రేపు (మంగళవారం) సౌతాఫ్రికాతో భారత్ టీ20 మ్యాచ్ లో తల పడనుంది. ఇదే సమయంలో టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ను సమాయత్తం చేస్తున్నారు. కాగా.. ఈ సారి టీ20 ప్రపంచ కప్ క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త హల్ చల్ చేస్తోంది. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
2026 టీ 20 ప్రపంచ కప్ కు ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే నిర్ణయం తెర మీదకు వచ్చింది. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ జియో హాట్ స్టార్ షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలకు ఓటీటీ పార్ట్ నర్ గా కొనసాగుతున్న 'జియోహాట్ స్టార్' ఒప్పందం నుంచి తప్పుకోవాలని భావిస్తుందని..ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసిందని తెలుస్తోంది.

కాగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ 2024లో ఐసీసీ టోర్నీల స్ట్రీమింగ్ హక్కులు 3 బిలియన్ డాలర్ల భారీ ధరకు దక్కించుకుంది. ఈ అగ్రిమెంట్ నాలుగేళ్ల పాటు, అంటే 2027 దాకా ఉంది. అయితే ఈ డీల్‌తో జియోహాట్‌స్టార్ గత రెండేళ్లలో భారీగా నష్టపోయినట్లు చెబుతు న్నారు. దీంతో అగ్రిమెంట్లో కొనసాగలేమని జియోహాట్ స్టార్ ఐసీసీకి సమాచారం ఇచ్చింది.
దీంతో, ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఐసీసీ కొత్త పార్టనర్ కోసం అన్వేషిస్తోంది. 2026- 29 మధ్య కాలానికి కొత్త పార్టనర్ ను ఐసీసీ ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఆధారంగా లైవ్ స్ట్రీమింగ్ అందిస్తోంది. అయితే జియో నెట్వర్క్ యూజర్లకు మాత్రం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్స్ తో జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభించేది. దీంతో జియో యూజర్లు ఉచితంగానే మ్యాచ్ లు చేశారు. ఇక కొత్త భాగస్వామితో ఐసీసీ అగ్రిమెంట్ చేసుకుంటే ఇకపై సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో.. ఇప్పుడు ఐసీసీ ఈ వ్యవహారం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది.. ఎవరు చివరకు ఓటీటీ పార్టనర్ గా ఎంట్రీ ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications