జాక్ పాట్ కొట్టిన శుభమన్ గిల్

ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ వెలువడ్డాయి. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ కే చెందిన తన సహచర ఆటగాడు జో రూట్‌ను వెనక్కి నెట్టి బ్రూక్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ (WTC) 2025-27 మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో రాణించి, ఇంగ్లాండ్ 115 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించడంతో బ్రూక్ ఈ ఘనత సాధించాడు.

2024 డిసెంబర్‌లో మొదటిసారి అగ్రస్థానానికి వచ్చిన హ్యారీ బ్రూక్, మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో జో రూట్ మొదటి ఇన్నింగ్ లో 1, రెండో ఇన్నింగ్ లో 8 పరుగులకు మాత్రమే పరిమితం అయ్యాడు. దీంతో అతను ఈ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లల్లో మూడో స్థానానికి పడిపోవాల్సొచ్చింది. జూన్ 17 నుంచి ఓవల్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ జరగనున్న తరుణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ICC Latest Test Batting Rankings Shubman Gill Reaches a New Peak with no 8 Shattering India s Records

మరోవైపు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ రెండో స్థానానికి ఎగబాకాడు. మిగతా ఆటగాళ్ల విషయానికొస్తే ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ బాదిన టీమిండియా టెస్ట్ కేప్టెన్ శుభమన్ గిల్ రెండు స్థానాలు ఎగబాకాడు. ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు. లార్డ్స్ ప్రదర్శనతో జేమీ స్మిత్ అయిదు స్థానాలు మెరుగుపడి 23వ స్థానానికి, గ్లెన్ ఫిలిప్స్ 15 స్థానాలు ఎగబాకి 40వ పొజీషన్ కు చేరుకున్నాడు.

బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ ఏడు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. దీర్ఘకాల విరామం తర్వాత టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోకి ఆస్ట్రేలియా పేసర్లు కైల్ జేమీసన్ (22వ స్థానం), ఆలీ రాబిన్సన్ (23వ స్థానం) తిరిగి ప్రవేశించారు. అలాగే నాథన్ స్మిత్ 16 స్థానాలు మెరుగుపడి 43వ ర్యాంకుకు చేరుకున్నాడు

వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ విజయంలో మొత్తం ఆరు వికెట్లు తీసి బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఇదే సిరీస్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన మరో పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది నాలుగు స్థానాలు మెరుగుపడి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ 31వ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా ర్యాంక్ నంబర్ 24.

వన్డే బ్యాటింగ్ విభాగంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 12వ స్థానానికి, జనిత్ లియనగే 22వ స్థానానికి చేరుకున్నారు. అలాగే బంగ్లాదేశ్ బ్యాటర్ తంజిద్ హసన్ 33వ స్థానానికి చేరుకుని తమ తాజా ర్యాంకులను మెరుగుపరుచుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+