రోహిత్ శర్మ ఆడకపోయినా ఎలా వచ్చాయ్..!!

Rohit Sharma: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ది బెస్ట్ అనిపించుకున్న ప్లేయర్లకు టాప్ 10 చోటు లభించింది. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ప్లేయర్ల హవా కనిపించింది ఇందులో.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్. అతనికు ఉన్న పాయింట్లు 899. రెండో స్థానంలో నిలిచాడు న్యూజిలాండ్ మాజీ కేప్టెన్ కేన్ విలియమ్సన్ నిలిచాడు. అతని ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య.. 859. 768 పాయింట్లతో న్యూజిలాండ్‌కే చెందిన మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిఛెల్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు.

ICC Test rankings Rohit Sharma Yashasvi Jaiswal and Virat Kohli in Top 10

ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు నాలుగో స్థానం దక్కింది. 757 పాయింట్లతో ఫోర్త్ పొజీషన్‌లో నిలిచాడు. ఇక ఆ తరువాతి మూడు స్థానాలు కూడా టీమిండియావే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయిదో స్థానంలో రోహిత్ శర్మ- 751 ఉండగా.. యశస్వి జైస్వాల్- 740, విరాట్ కోహ్లీ- 737 పాయింట్లతో ఆరు, ఏడు స్థానంలో నిలిచారు.

ఎనిమిదో స్థానంలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా నిలిచాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియన్ మార్నుస్ లాంబుషేన్ తలా 720 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఈ ఏడాది మార్చి తరువాత ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు టీమిండియా. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ చివరిది. ఈ నెల 19వ తేదీ నుంచి భారత్ వరుస టెస్ట్ సిరీస్‌లను ఆడబోతోంది. తొలి సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్క ఆరంభం కాబోతోంది. ఆ తరువాత ఆస్ట్రేలియాలో అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌కు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. చివరిదైన రెండో మ్యాచ్ కాన్పూర్‌లో షెడ్యూల్ అయింది. ఆ తరువాత మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి.

కాగా- ఈ ఏడాది మార్చి తరువాత భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ- ఈ ఫార్మట్ ర్యాంకింగ్స్‌లల్లో ఏకంగా ముగ్గురు టీమిండియా ప్లేయర్లు- రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీలకు చోటు దక్కడం చర్చనీయాంశమైంది. అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+