భారత్ - పాక్ మ్యాచ్ లో గెలుపెవరిదో తేల్చేసిన ఐఐటీ బాబా..!!
India Vs Pakistan Match: క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు మజా మొదలైంది. భారత్ - పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ కు సర్వం సిద్దమైంది. ఈ మ్యాచ్ పైన ఇరు వైపులా భారీ అంచనాలు ఉన్నాయి. దుబాయ్ పిచ్ కండీషన్లు... గత రికార్డులు కీలకంగా మారుతున్నాయి. తుది జట్ట కూర్పు లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావటంతో జోతిష్యులు రంగంలోకి వస్తున్నారు. తాజాగా ఈ మ్యాచ్ ఫలితం పైన ఐఐటీ బాబా తన అంచనాల ను వెల్లడించారు.
బాబా జోస్యం
దుబాయ్ లో మ్యాచ్ మొదలవుతున్న వేళ జ్యోతిష్కులు ఎంట్రీ ఇస్తున్నారు. ఐఐటీ బాబాగా పాపులర్ అయిన వ్యక్తి అభయ్ సింగ్. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. అతను ఒకప్పుడు ఐఐటీ బాంబే నుండి డిగ్రీ పొందిన ఏరోస్పేస్ ఇంజనీర్. అతను కెనడాలో అధిక జీతంతో ఉద్యోగం చేశారు. కుంభమేళాలో ఐఐటీ బాబాగా ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు పాకిస్థాన్ వర్సెస్ ఇండియా హైఓల్టేజ్ మ్యాచ్ ఫలితం పై జోస్యం చెప్పాడు. పాకిస్థాన్ విజయం సాధిస్తుందని అంచనాగా వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లెక్క మారేనా
ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమి తప్పదని చెప్పుకొచ్చారు, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు ఎవరు ఎంతమంది ఆడినా టీమిండియాకు పరాజయం తప్పదని గట్టిగా చెబుతున్నారు. తాను ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మారదు. ఏం జరగాలని రాసిఉందో అది జరిగి తీరుతుందన్నారు. తాను గెలవదని చెప్పానంటే.. గెలవదు అంతే అని సవాల్ చేస్తున్నారు. దీంతో, అసలు ఈ మ్యాచ్ లో ప్రతీ విభాగంలో పటిష్ఠంగా రెండు జట్లు ఉన్నా, అదే సమయంలో రెండు జట్లలోనూ కొన్ని బలహీనతలు కనిపిస్తున్నాయి.
విజయం ఎవరిది
టీం ఇండియాలో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉండటం.. తటస్థ గ్రౌండ్ కావటంతో అంచనాలు మారిపోతున్నాయి. ఐఐటీ బాబా పాక్ కు మద్దతుగా జోస్యం చెప్పినా... దుబాయ్ లో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మెజార్టీ మద్దతు భారత్ కే ఇస్తున్నారు. గ్రౌండ్ రిపోర్టు సైతం భారీ స్కోర్లు ఖాయమని చెబుతున్నాయి. దీంతో, తొలుత బ్యాటింగ్ చేసే టీం నిర్దేశించే లక్ష్యం ఛేజింగ్ టీం కు కష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్ ఇక్కడ మ్యాచ్ ను డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications