రేపే తొలి టీ20 మ్యాచ్: టీమిండియాకు గుడ్ న్యూస్
Rashid Khan: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో ఓటమి తరువాత.. భారత జట్టు వరుస జైత్రయాత్రలను కొనసాగిస్తోంది. వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విజయదుందుభి మోగించింది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించింది.
ఇక తాజాగా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది. మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్ ఇది. భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ గురువారం ఆరంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు మొహాలీ స్టేడియంలో ఈ గేమ్ జరుగనుంది. 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరుల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి.

ఇప్పటికే రెండు జట్లు కూడా మొహాలీ చేరుకున్నాయి. నెట్స్ ప్రాక్టీస్‌లో పాల్గొంటోన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టకు బ్యాడ్ న్యూస్ వెలువడింది. జట్టు ఆల్ రౌండర్ రషీద్ ఖాన్.. ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. మూడు మ్యాచ్‌లల్లో కూడా ఆడట్లేదని ప్రకటించాడు. వెన్నునొప్పి వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ తెలిపింది.
ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ కేప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ ధృవీకరించాడు. రషీద్ ఖాన్ ఈ సిరీస్‌లో ఆడట్లేదని స్పష్టం చేశాడు. రెండు నెలల కిందట రషీద్ ఖాన్ వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ముగిసిన వెంటనే అతను సర్జరీ చేయించుకున్నాడు.

ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 ఇంటర్నేషనల్స్‌కు దూరం అయ్యాడు. ఆ తరువాత బిగ్ బాష్ లీగ్స్‌లోనూ ఆడలేదు. భారత పర్యటనను దృష్టిలో పెట్టుకుని అతనికి జట్టులో చోటు కల్పించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్. తీరా సిరీస్ ఆరంభం అయ్యే సమయానికి అతను వైదొలిగాడు.
భారత్‌లో పిచ్‌లపై మంచి అవగాహన, టీమిండియాపై అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న రషీద్ ఖాన్ తప్పుకోవడం ఆఫ్ఘనిస్తాన్‌ను ఇబ్బందులకు గురి చేసేదే. అటు భారత్‌కు ఇది గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. స్పిన్ మాయాజాలంలో ఇబ్బంది పెట్టే బౌలర్ లేకపోవడం ఊపిరి పీల్చుకున్నట్టయింది.












Click it and Unblock the Notifications