రెండో టీ20: టీమ్‌లో కోహ్లీ: బౌలర్ల ఊచకోతే..!!
IND vs AFG 2nd T20: భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ కోసం సర్వ సిద్ధమైంది. సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచింది టీమిండియా. తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పఠాన్లను మట్టికరిపించింది. అదే దూకుడును రెండో మ్యాచ్‌లో కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
ఈ సాయంత్రం 7 గంటలకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఆరంభం కానుంది. 17 తేదీన బెంగళూరులో జరిగే మూడో మ్యాచ్‌తో సిరీస్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ అందుబాటులో లేని మ్యాచ్ అది. రోహిత్ శర్మ కూడా ఘోరంగా విఫలం అయ్యాడు. డకౌట్ అయ్యాడు.

అయినప్పటికీ.. యంగ్ క్రికెటర్లు చెలరేగారు. ప్రత్యేకించి- టీ20 స్పెషలిస్ట్ శివం దుబే హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. 40 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో యంగ్ బ్యాటర్ వికెట్ కీపర్ జితేష్ శర్మ 20 బంతుల్లో అయిదు ఫోర్లతో 31 పరుగులు చేశాడు.
రెండో మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చాడు. జట్టుతో కలిశాడు. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రెండో మ్యాచ్ ఆడే తుదిజట్టులో అతన్ని తీసుకోవడం ఖాయం. అలాగే- ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై సునామీలా విరుచుకు పడటమూ ఖాయంగానే కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ.. ఈ గేమ్‌లో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే.
𝙍𝙀𝘼𝘿𝙔 to roar in Indore 😎 👌@ImRo45 🤝 @imVkohli #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/bYrWlR2TPT
— BCCI (@BCCI) January 14, 2024
విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తిలక్ వర్మకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చు. యశస్తి జైస్వాల్ లేదా శుభ్‌మన్ గిల్‌లల్లో ఒకరినే తీసుకుంటారనే అంచనాలు ఉన్నాయి. జైస్వాల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తే రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్‌ను ఆరంభిస్తాడు.
టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), యశస్వి జైస్వాల్/శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శివం దుబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్/అవేష్ ఖాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications