Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీమిండియాలో భారీ మార్పులు: అదే ఆందోళన

IND vs AFG 3rd T20: భారత్- ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ కోసం సర్వ సిద్ధమైంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. వైట్ వాష్‌పై కన్నేసింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.

మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో ఆధిక్యతలో సొంతం చేసుకుంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పఠాన్లను మట్టికరిపించింది. అదే దూకుడును రెండో మ్యాచ్‌లో కొనసాగించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయాన్ని సాధించింది.

IND vs AFG 3rd T20: India eyes on white wash

మూడో మ్యాచ్‌లో కూడా విజయకేతనాన్ని ఎగురవేసి 3-0 తేడాతో ఈ సిరీస్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా నెట్స్‌లో శ్రమిస్తోన్నారు ప్లేయర్లు. అయిదు సంవత్సరాల్లో స్వదేశంలో జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్ ద్వైపాక్షిక సిరీస్‌ను ఎప్పుడూ కోల్పోలేదు భారత్.

ఈ అయిదేళ్లల్లో జరిగిన 13 మ్యాచ్‌లల్లో విజయం సాధించింది. రెండు డ్రాగా ముగిశాయి. ఈ రికార్డును మెరుగుపర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సిరీస్ ఆల్‌రెడీ గెలిచిన నేపథ్యంలో తుదిజట్టులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, బౌలర్లు కుల్‌దీప్ యాదవ్, అవేష్ ఖాన్‌లను తీసుకోవచ్చు.

IND vs AFG 3rd T20: India eyes on white wash

సిరీస్ గెలిచిన మాటెలా ఉన్నప్పటికీ.. రోహిత్ శర్మ విఫలం కావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. పట్టుమని 10 బంతులు కూడా ఆడలేదు ఈ రెండు మ్యాచ్‌లల్లో కలిపి. తొలి మ్యాచ్‌లో రెండు బంతులను ఎదుర్కొని రనౌట్ అయ్యాడు. రెండో గేమ్‌లో గోల్డెన్ డక్ సాధించాడు. జట్టు వరుస విజయాలు సాధిస్తోన్నప్పటికీ.. రోహిత్ శర్మ ఫామ్ కలవరపరుస్తోంది.

తుదిజట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ/సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ /రవి బిష్ణోయ్/కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+