మూడో టెస్ట్‌లో హైడ్రామా- ట్విస్టులే ట్విస్టులు: చివరి రోజు టీమిండియాకు ఊరించే టార్గెట్..!!
India vs Australia: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని ప్రతిష్ఠాత్మక గబ్బా స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసకందాయంలో పడింది. చివరి రోజు ఊరించే టార్గెట్‌ను భారత్ ముందుంచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ గెలవాలంటే భారత్‌కు 275 పరుగులు అవసరం. 54 ఓవర్లల్లో దీన్ని ఛేదించాల్సి ఉంటుంది. లేదంటే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది.
చివరి రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఊపిరి ఆడనివ్వకుండా బంతులను సంధించారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే వెనుదిరిగాడు. ఏ ఒక్కరు కూడా లోయర్ మిడిలార్డర్‌లో ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ, కేప్టెన్ పాట్ కమ్మిన్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు.

ట్రావిస్ హెడ్- 17, అలెక్స్ కేరీ- 19 (నాటౌట్), పాట్ కమ్మిన్స్- 22 పరుగులు చేశారు. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ- 4, ఉస్మాన్ ఖవాజా- 8, మార్నుస్ లాంబుషేన్- 1, మిఛెల్ మార్ష్- 2, స్టీవెన్ స్మిత్- 4, మిఛెల్ స్టార్క్- 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఒక దశలో 33 పరుగులకు ఏకంగా అయిదు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా.
ఈ ముగ్గురూ ఆదుకోవడంతో 89 పరుగుల వరకూ వెళ్లగలిగింది. ఏడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసిన దశలో ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది. దీనితో భారత్ గెలవడానికి 275 పరుగులు అవసరం అయ్యాయి. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్- 4, కేఎల్ రాహుల్- 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది భారత్.
టీమిండియా ఇన్నింగ్‌లో బౌలర్లందరూ నిప్పులు చెరిగారు. జస్‌ప్రీత్ బుమ్రా- 3, మహ్మద్ సిరాజ్- 2, ఆకాష్ దీప్- 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకుంటూ కట్టర్, స్వింగ్‌లతో దుమ్ము దులిపారు.












Click it and Unblock the Notifications