ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జట్టు ప్రతీకార విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ పరాజయంతో సెమీ ఫైనల్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది ఆసీస్. తొలుత ఆఫ్ఘనిస్తాన్, అనంతరం భారత్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లల్లో ఓడటం వల్ల సూపర్ 8 దశలోనే తన వరల్డ్ కప్ ప్రస్థానాన్ని ముగించాల్సి వచ్చింది.

సెయింట్ లూసియాలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియాను 181 పరుగుల వద్దే కట్టడి చేసింది.

IND vs AUSL Rohit Sharma surpasses Virat Kohli and levels Babar Azam s record

కేప్టెన్ రోహిత్ శర్మ 92 పరుగులతో చెలరేగాడు. 41 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, ఏడు ఫోర్లతో వింటేజ్ హిట్ మ్యాన్‌ను గుర్తుకు తెచ్చాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో ఓడించిందనే కసితో ఆడినట్టనిపించింది అతని బ్యాటింగ్. రోహిత్ ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ టోర్నమెంట్‌లో మొట్టమొదటిసారిగా టీమిండియా స్కోర్ 200 మార్క్‌ను అధిగమించింది.

ఈ ఇన్నింగ్‌తో రోహిత్ శర్మ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టయింది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులను చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 157 టీ20ల్లో 4,165 కొట్టాడు. ఇదివరకు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. దాన్ని అధిగమించాడు రోహిత్ శర్మ. 123 టీ20ల్లో 4,145 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండేవాడు కోహ్లీ. ఇప్పుడు రెండో స్థానానికి దిగాడు.

ఇందులో బాబర్ ఆజమ్‌ది మూడోస్థానం. 4,103 పరుగు అతని పేరు మీద ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డును కూడా సమం చేశాడు రోహిత్. కేప్టెన్‌గా టీ20ల్లో ఎక్కువసార్లు జట్టును గెలిపించిన రికార్డు ప్రస్తుతం బాబర్ ఆజమ్ పేరు మీద ఉంది. దాన్ని ఈక్వల్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+