అదే బ్యాటింగ్‌ రా అయ్యా..!!

Rohit Sharma and Yashasvi Jaiswal: కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజృంభిస్తోంది. నాలుగో రోజు తొలి ఇన్నింగ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. తొలుత ప్రత్యర్థిని 233 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది.

టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లెవరూ నిలవలేకపోయారు.. ఒక్క మొమినుల్ హక్ మినహా. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన హక్.. ఒక సిక్సర్, 17 బౌండరీలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగలిన బ్యాటర్లెవరూ కూడా భారీ స్కోర్ చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారు.

IND vs BAN 2nd test Rohit Sharma and Jaiswal registered fastest 50 ever in test cricket history

ఓపెనర్ జకీర్ హసన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ షద్మన్ ఇస్లాం- 24, కేప్టెన్ నాజ్ముల్ హొస్సేన్ శాంటో- 31, ముష్ఫికర్ రహీం- 11, షకీబల్ హసన్- 9, లిట్టన్ దాస్- 13, మెహదీ హసన్ మిర్జా- 20, తైజుల్ ఇస్లాం- 5, హసన్ మహమూద్- 1, ఖలేద్ అహ్మద్ డకౌట్ అయ్యారు.

భారత బౌలర్లల్లో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు కూల్చాడు. రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ రెండు చొప్పున, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ వికెట్‌తో జడేజా టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దుమ్ము రేపింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారీ షాట్లతో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడం అద్భుతః అనిపించింది. 11 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 23 పరుగులు చేశాడు రోహిత్.

ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. హసన్ మీర్జా బౌలింగ్‌లో మెహదీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దీనితో 76 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత్. ప్రస్తుతం యశస్వి జైస్వాల్- 48, శుభ్‌మన్ గిల్-3 పరుగులతో ఆడుతున్నారు.

కాగా- ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి. టెస్టు మ్యాచ్‌లల్లో శరవేగంగా 50 పరుగులను జోడించారు. వారిద్దరి సునామీ ఇన్నింగ్‌కు మూడు ఓవర్లల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకుంది టీమిండియా. ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఏ టీమ్ అయినా ఇంత వేగంగా 50 పరుగులు చేయడం ఇదే తొలిసారి. గతంలో 26 బంతులకు ఇంగ్లాండ్ 50 పరుగులు చేసింది. ఇప్పుడది మరుగునపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+